ఆత్మకూరు ఉప ఎన్నికలో పోటీ చేస్తాం: సోము వీర్రాజు

ABN , First Publish Date - 2022-04-23T00:15:39+05:30 IST

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు.

ఆత్మకూరు ఉప ఎన్నికలో పోటీ చేస్తాం: సోము వీర్రాజు

నెల్లూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరులో త్వరలో జరిగే ఉప ఎన్నికలో బీజేపీ పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆత్మకూరు ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున అభ్యర్థిని నిలబెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో జగన్‌ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని దుయ్యబట్టారు. పాదయాత్రలో సీఎం జగన్‌ ఇచ్చిన 2.3 లక్షల పోస్టుల భర్తీ హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు చేస్తున్న అవినీతికి పోలీసు శాఖ అండగా నిలుస్తోందని సోము వీర్రాజు ఆరోపించారు.  

Updated Date - 2022-04-23T00:15:39+05:30 IST