బైజూస్‌ చేతికి ‘టింకర్‌’

ABN , First Publish Date - 2021-09-18T06:20:49+05:30 IST

ఎడ్యుటెక్‌ వేదిక ‘బైజూస్‌’, కోడింగ్‌ సంస్థ ‘టింకర్‌’ను విలీనం చేసుకుంది. కొనుగోలు రేటు వెల్లడి కాలేదు. అమెరికాలో తమ కార్యకలాపాలను...

బైజూస్‌ చేతికి ‘టింకర్‌’

ఎడ్యుటెక్‌ వేదిక ‘బైజూస్‌’, కోడింగ్‌ సంస్థ ‘టింకర్‌’ను విలీనం చేసుకుంది. కొనుగోలు రేటు వెల్లడి కాలేదు. అమెరికాలో తమ కార్యకలాపాలను విస్తరించుకునేందుకు వీలుగా ‘టింకర్‌’ను విలీనం చేసుకున్నట్టు ఆ సంస్థ తెలిపింది. దీంతో బైజూస్‌కు మరో లాభం కూడా ఉంది. టింకర్‌ ఆధీనంలో ఉన్న అరవై కోట్ల మంది విద్యార్థులు 150 దేశాల్లోని లక్షకు పైగా స్కూళ్ళు కూడా బైజూస్‌ పరిధిలోకి వస్తాయి. ఈ రెండు సంస్థల ఉమ్మడి కల, లక్షల మంది విద్యార్థులకు కోడింగ్‌ అందుబాటులోకి వస్తుంది. విలీనమైనప్పటికీ ‘టింకర్‌’ కోఫౌండర్లు ప్రస్తుతం తాము ఉన్న స్థానాల్లోనే కొనసాగుతారు. 

Updated Date - 2021-09-18T06:20:49+05:30 IST