బోనస్ షేర్ల జారీ ప్రతిపాదనను 25 న పరిశీలించనున్న బ్రైట్‌కామ్ గ్రూప్...

ABN , First Publish Date - 2022-01-17T21:15:12+05:30 IST

బోనస్ షేర్ల జారీకి సంబంధించిన ప్రతిపాదనను కంపెనీ ప్రకటించిన తర్వాత బ్రైట్‌కామ్ గ్రూప్ షేర్లు బీఎస్ఈలో 5 % పెరిగి, రూ.191 కు చేరాయి.

బోనస్ షేర్ల జారీ ప్రతిపాదనను 25 న పరిశీలించనున్న బ్రైట్‌కామ్ గ్రూప్...

హైదరాబాద్ : బోనస్ షేర్ల జారీకి సంబంధించిన ప్రతిపాదనను కంపెనీ ప్రకటించిన తర్వాత బ్రైట్‌కామ్ గ్రూప్ షేర్లు బీఎస్ఈలో 5 % పెరిగి, రూ.191 కు చేరాయి. కాగా...  బోనస్ షేర్ల జారీ ప్రతిపాదనను కంపెనీ బోర్డు... 25 వ తేదీ(మంగళవారం)న పరిశీలించనుంది. ఆ రోజున జరగనున్న బోర్డు సమావేశం... వాటాదారుల ప్రయోజనం కోసం బోనస్ షేర్లను ప్రకటించే ప్రతిపాదనను పరిశీలిస్తుందని బ్రైట్‌కామ్ గ్రూప్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో ప్రకటించింది. బ్రైట్‌కామ్ గ్రూప్ షేర్లు ఒక సంవత్సరం వ్యవధిలో 2,862 శాతానికి మించి మల్టీబ్యాగర్ రాబడిని అందించాయి. దాదాపు రూ. 6 ట్రేడింగ్ నుంచి, ప్రస్తుతం ఒక్కో షేరుకు రూ. 191 కు చేరుకుంది. మల్టీబ్యాగర్ స్టాక్ గత ఆరు నెలల్లోనే 475 శాతం కంటే ఎక్కువ ర్యాలీ చేసింది. ‘బ్రైట్‌కామ్ షేర్ గత సంవత్సర కాలంగా పలు రెట్లు పెరిగినందున, అది ఇప్పుడు చిన్న ఇన్వెస్టర్లకు  అందుబాటులో లేకుండా పోయింది. 


బోనస్ షేర్లను జారీ చేయడం వల్ల తమ షేర్‌హోల్డర్ జాబితాలోని కొత్త, ఇన్‌కమింగ్ మెంబర్‌లకు మరింత అనుకూలంగా మారుతుందని కంపెనీ ఈ సందర్భంగా పేర్కొంది. బ్రైట్‌కామ్ గ్రూప్... డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ అన్న విషయం తెలిసిందే. ఇది ప్రపంచవ్యాప్తంగా యాడ్-టెక్, న్యూ మీడియా, ఎల్‌ఓటీ ఆధారిత  వ్యాపారాలను ఏకం చేస్తుంది. కంపెనీ గ్లోబల్ ఉనికిలో... అమెరికా, ఇజ్రాయెల్, లాటిన్ అమెరికా ఎంఈ, పశ్చిమ యూరోప్, ఆసియా పసిఫిక్ ప్రాంతాలున్నాయి. ఎయిర్‌టెల్, బ్రిటిష్ ఎయిర్‌వేస్, కోకా-కోలా, హ్యుందాయ్ మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ, ఎల్ఐసీ, మారుతి  సుజుకి, ఎమ్‌టీవీ, పీఅండ్‌జీ, ఖతార్ ఎయిర్‌వేస్, శామ్‌సంగ్, వయాకామ్, సోనీ, స్టార్ ఇండియా, వొడాఫోన్, టైటాన్ వంటి ప్రముఖ బ్లూ చిప్ ప్రకటనదారులు దీని క్లయింట్‌లలో ఉన్నారు. 

Updated Date - 2022-01-17T21:15:12+05:30 IST