ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఆలయాలపై దాడులు

ABN , First Publish Date - 2020-11-04T11:01:22+05:30 IST

ప్రభుత్వ నిర్ణక్ష్యం వల్లే రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని శైవ క్షేత్రాధిపతి శివస్వామి ఆరోపించారు.

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఆలయాలపై దాడులు

 శైవ క్షేత్రాధిపతి శివస్వామి ఆగ్రహం

 శివగిరి క్షేత్రంలో శ్రీకృష్ణుని విగ్రహం ధ్వంసం


విజయవాడ (మొగల్రాజపురం), నవంబరు 3: ప్రభుత్వ నిర్ణక్ష్యం వల్లే రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని శైవ క్షేత్రాధిపతి శివస్వామి ఆరోపించారు. స్థానిక మొగల్రాజపురం శివ గిరి క్షేత్రంలో శ్రీకృష్ణుని విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. విషయం తెలిసిన శివస్వామి, విశ్వహిందూ పరిషత్‌ నగరా ధ్యక్షుడు టి.శ్రీనివాసరావు శివగిరి క్షేత్రాన్ని సందర్శించి క్షేత్రం వ్యవస్థాప కుడు మల్లికార్జున శర్మ నుంచి వివరాలు తెలుసుకున్నారు. సోమవారం యథాప్రకారం అర్చకులు పూజాధికాలు ముగించి వెళ్లిపోయారని, సా యంత్రం సమయంలో విగ్రహం పడిపోయి ఉండటంతో సిబ్బంది గమ నించి మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేయగా ఏసీపీ నాగేశ్వరరావు వచ్చి పరిశీలించి వెళ్లారని శివస్వామికి తెలిపారు.


అనంతరం శివస్వామి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 60 చోట్ల హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయని, అయినా ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేద న్నారు. విదేశీ వ్యక్తుల ప్రమేయంతో ఈ దాడులు జరుగుతున్నట్టు అను మానాలు వస్తున్నాయన్నారు. సీఎం జగన్‌ చర్యలు తీసుకోవాలని, లేకుం టే రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపడతామని హెచ్చరించారు. అలాగే దీపావ ళి పండుగను ప్రజలు జరుపుకోవడానికి వీలుగా ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు విధించకుండా సహకరించాలని కోరారు.

Updated Date - 2020-11-04T11:01:22+05:30 IST