కేంద్ర విధానాలపై నిరసన వెల్లువ

ABN , First Publish Date - 2020-11-09T07:56:52+05:30 IST

కేంద్ర ప్రభుత్వ కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆదివారం నుంచి సీపీఎం ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీలు ప్రారంభమయ్యాయి.

కేంద్ర విధానాలపై నిరసన వెల్లువ

మచిలీపట్నం టౌన్‌, నవంబరు 8 : కేంద్ర ప్రభుత్వ కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆదివారం నుంచి సీపీఎం ఆధ్వర్యంలో   బైక్‌ ర్యాలీలు ప్రారంభమయ్యాయి. శారదానగర్‌ నుంచి వడ్డి రంగారావు నగర్‌, శివగంగ, కాలేఖాన్‌ పేట, పట్టీలకొట్టు సెంటర్‌, అమృతపురం, ఓగీసు పేట, జలాల్‌పేట, సర్కిల్‌పేట, పాతరామన్నపేట, ఉల్లింగిపాలెం, మలకాపట్నం, బుట్టాయిపేటల మీదు గా బైక్‌ ర్యాలీ సాగింది.  పట్టణ కార్యదర్శి సీహెచ్‌ రవి, కొల్లాటి శ్రీనివాసరావు, పి. పవన్‌, సీహెచ్‌ రాజేష్‌, బి. సుబ్రహ్మణ్యం, జయరావు, సత్యనారా యణ, ప్రసాద్‌, కిషోర్‌, జస్వంత్‌లు పాల్గొన్నారు. తొలుత అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నాయకులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. 


గుడివాడలో..

గుడివాడటౌన్‌ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని, పోలవరం నిర్మిస్తామని, రాజధాని అమరావతి నిర్మాణానికి సహకరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చి మోసం చేసినా, వైసీపీ, టీడీపీలు కేం ద్రంతో రాజీధోరణి అనుసరించడాన్ని నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. బీజేపీ మతోన్మాదం నశిం చాలని, ఉద్యోగ, కార్మిక హక్కులు కాలరాస్తూ, వ్యవసాయరంగాన్ని కార్పొరేట్లకు కట్టబెడుతున్న కేంద్ర ప్రభుత్వ  విధానాలను ప్రజలు తిప్పికొట్టాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఆర్సీపీ రెడ్డి పిలుపునిచ్చారు. వేశపోగు ఎస్సయ్య, పల్లపు వీరమ్మ, రేపాని కొండ, పి.రజని పాల్గొన్నారు. 

కౌతవరం, పశుభొట్లపాలెంలలో


గుడ్లవల్లేరు : బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలంతా ముక్త కంఠంతో ఖండించాలని సీపీఎం జిల్లా నాయకుడు బి.వి శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. కౌతవరం, పశుభొట్లపాలెం, స్కాట్‌పేటల్లో నిరసన ప్రదర్శన నిర్వహించారు.


మొవ్వ మండలంలో బైక్‌ర్యాలీ

కూచిపూడి  : కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధా నాలను నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. నిడుమోలు, ఆవిరిపూడి, చినముత్తేవి, కారకంపాడు, అయ్యంకి, కూచిపూడి, మొవ్వ, కోసూరు గ్రామాల్లో ర్యాలీ నిర్వహించారు. 


దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయండి

మోపిదేవి  : కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 26వ తేదీన నిర్వహించే దేశవ్యాప్త సమ్మెలను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శీలం నారాయణరావు పిలుపు నిచ్చారు ఆదివారం భవన నిర్మాణ కార్మికులతో మండల కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. సమ్మె వాల్‌పోస్టర్లు ఆవిష్కరించారు. సీఐటీయూ మండల కార్యదర్శి సీహెచ్‌.రాజశేఖర్‌, మద్దాల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-09T07:56:52+05:30 IST