చౌడు భూములకు అనువైన వరి వంగడాల ఉత్పత్తి

ABN , First Publish Date - 2020-11-09T08:01:13+05:30 IST

చౌడు భూములకు అనువైన వరి వంగడాలను రూపొం దించినట్లు మచిలీపట్నం వ్యవసాయ పరిశోధనా స్థానం సైంటిస్టు ఎం గిరిజారాణి అన్నారు.

చౌడు భూములకు అనువైన వరి వంగడాల ఉత్పత్తి

మచిలీపట్నం టౌన్‌, నవంబరు 8 : చౌడు భూములకు అనువైన వరి వంగడాలను రూపొం దించినట్లు మచిలీపట్నం వ్యవసాయ పరిశోధనా స్థానం సైంటిస్టు ఎం గిరిజారాణి అన్నారు. పరిశోధనా క్షేత్రం రూపొందించిన నూతన వరి వంగడాలు ఎంసీఎం 100, ఎంసీఎం 103, ఎంసీఎం 109 రకాల వ్యవసాయ క్షేత్రాన్ని ఆమె పరిశీలిం చారు. జిల్లాలోని భూముల్లో సాగుకు ఎంటీయు 1140, ఎంటీయు 1224, ఎంటీయు 1262, బీపీటీ 5204, ఎంఎన్‌ 1061, ఎంఎన్‌ 1161, ఎంటీయు 1210 రకాలు అనుకూలమన్నారు. 1955లో ప్రారంభించిన పరిశోధనా క్షేత్రం ద్వారా రైతులకు సలహాలు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్‌ స్వామినాథన్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ సైంటిస్టు డాక్టర్‌ ఆర్‌. రామసుబ్రహ్మణ్యం, సుధాకర్‌, ప్రభాకర్‌, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-09T08:01:13+05:30 IST