వేర్వేరు నీటి ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం

ABN , First Publish Date - 2020-11-04T10:58:00+05:30 IST

జిల్లాలో జరిగిన వేర్వేరు నీటి ప్రమాదాల్లో ఇద్దరు విద్యా ర్థులతో పాటు ఒక వ్యక్తి, బాలిక మృతి చెం దారు. గేదెలను మేపుకుంటూ వెళ్లిన ఇద్దరు విద్యార్థులు కృష్ణా పాయ దాటుతూ నదిలో మునిగి మృతిచెందారు.

వేర్వేరు నీటి ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం

చందర్లపాడు, నవంబరు 3: జిల్లాలో జరిగిన వేర్వేరు నీటి ప్రమాదాల్లో ఇద్దరు విద్యా ర్థులతో పాటు ఒక వ్యక్తి, బాలిక మృతి చెం దారు. గేదెలను మేపుకుంటూ వెళ్లిన ఇద్దరు విద్యార్థులు కృష్ణా పాయ దాటుతూ నదిలో మునిగి మృతిచెందారు. కృష్ణాజిల్లా పొక్కునూ రు గ్రామానికి చెందిన గుర్రం తిరుపతిరావు, రాజ్యలక్ష్మీ కుమారుడు విద్యాసాగర్‌ (18) ఉగ్గం సైదులు, రాజ్యలక్ష్మీ కుమారుడు మురళీకృష్ణ (14) మంగళవారం గేదెలను మేపేందుకు కృష్ణానది ఒడ్డుకు వెళ్లారు. అక్కడి నుంచి నది మధ్యలోని లంక భూములకు వెళ్లేందుకు పాయ దాటుతుండగా ఇసుక కోసం తవ్విన 20 అడుగుల గుంతలో మునిగారు. వీరితో పాటు వెళ్లిన మర్రి అప్పారావు కేకలు వేయటంతో చుట్టు పక్కల వారు అక్కడికు చేరుకున్నారు.


అప్పటికే విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. జాలర్లు యువకుల మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు. విద్యాసాగర్‌ నందిగామలోని చైతన్య కళాశాలలో ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్స రం చదువుతుండగా మురళీకృష్ణ చందర్లపాడు జడ్పీ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతు న్నాడు. విద్యార్థుల మృతితో తల్లిదండ్రులు కన్నీ రుమున్నీరుగా విలపిస్తున్నారు. అలాగే కోనా యపాలెం గ్రామానికి చెందిన మాదవరపు రంగయ్య (56) గ్రామ సమీపంలోని వాగు వద్దకు చేపలు పట్టేందుకు వెళ్లాడు. వాగులో లోతు ఎక్కువగా ఉన్న గుంతల్లో జారిపడి మృ తి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

Updated Date - 2020-11-04T10:58:00+05:30 IST