Zest money flagship ‘pay-in-3' ఆఫర్‌... ICICI బ్యాంక్ ఖాతాదారులకూ అందుబాటులోకి

ABN , First Publish Date - 2022-06-09T21:10:48+05:30 IST

ICICI బ్యాంక్ కస్టమర్‌లు ‘zest money flagship ‘pay-in-3' ఆఫర్‌ను ఇక వినియోగించుకునే వెసులుబాటు కలిగింది.

Zest money flagship ‘pay-in-3' ఆఫర్‌...   ICICI బ్యాంక్ ఖాతాదారులకూ అందుబాటులోకి

హైదరాబాద్ : ‘zest money flagship ‘pay-in-3' ఆఫర్‌ను వినియోగించుకునే వెసులుబాటు ఇప్పుడు  ICICI బ్యాంక్ కస్టమర్లకు కూడా అందుబాటులోకొచ్చింది. బిల్లు అదనపు ఖర్చులు లేకుండా మూడు సమానమైన నెలవారీ వాయిదాల(EMIలు) సౌలభ్యముంటుంది. ఇ-కామర్స్ వెబ్‌సైట్/యాప్ చెక్-అవుట్‌లో. లేదా...  రిటైల్ అవుట్‌లెట్‌లలోని PoS మెషీన్‌లో కస్టమర్‌లు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, పాన్, OTP వివరాలనందించడం ద్వారా రూ. 10 లక్షల వరకు లావాదేవీలను EMIలుగా మార్చుకోవచ్చు. కార్డులు ఉపయోగించకుండానే ఈ సౌకర్యాన్ని వినియోగించుకునే వెసులుబటు ఉండడం దీని ప్రత్యేకత.


ఈ సదుపాయం... ZestMoney భాగస్వామ్యంతో... ఎంపిక చేసిన ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లలో ప్రత్యక్ష ప్రసారమవుతుంది. అంతేకాకుండా... త్వరలో రిటైల్ స్టోర్‌ల్లో కూడా అందుబాటులోకి రానుంది. ICICI బ్యాంక్ ప్రీ-అప్రూవ్డ్ కస్టమర్‌లు Xiaomi, OnePlus, షుగర్, Mamaearth, Decathlon, Boat, Yatra, Urban Ladder, Vijay Sales, Titan Eye Plus తదితర బ్రాండ్‌ల కోసం సదుపాయాన్ని పొందవచ్చు. ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్‌లు, ప్రయాణం, ఫ్యాషన్ దుస్తులు, క్రీడా దుస్తులు, విద్య, గృహాలంకరణ వంటి వర్గాలలో కూడా ఈ సదుపాయాన్ని పొందవచ్చు. నగదురహిత కొనుగోళ్లను అందించేందుకుగాను 2020 లో ‘కార్డ్‌లెస్ EMI’ సదుపాయాన్ని ప్రవేశపెట్టిన తొట్టతొలి బ్యాంక్ ICICI. ఈ వెసులుబాటు గురించి వివరిస్తూ ‘ఈ మొత్తం సౌకర్యం ముఖ్య ప్రయోజనాలు... ఇది డిజిటల్, కాంటాక్ట్‌లెస్, సురక్షితమైనది. వినియోగదారులు ఈ సదుపాయానికి సంబంధించి ఎటువంటి ప్రాసెసింగ్ రుసుమునూ చెల్లించాల్సిన అవసరం లేదు’ అని బ్యాంక్ పేర్కొంది. 

Updated Date - 2022-06-09T21:10:48+05:30 IST