పిల్లల ఎదుగుదలకు సి-విటమిన్‌

ABN , First Publish Date - 2021-06-17T16:55:20+05:30 IST

పిల్లల ఎదుగుదల బాగుండాలంటే తగినంత విటమిన్‌-సి అందేలా చూడాలి. సి - విటమిన్‌ శరీరంలో ఉత్పత్తి కాదు అలాగే శరీరంలో నిలువ ఉండదు. అందుకే రోజూ తగినంత సి-విటమిన్‌ లభించేలా మెనూ ప్లాన్‌ చేయాలి. పిల్లల్లో ఇమ్యూనిటీ బాగుండటానికి కూడా ఇది అవసరం.

పిల్లల ఎదుగుదలకు సి-విటమిన్‌

ఆంధ్రజ్యోతి(17-06-2021)

పిల్లల ఎదుగుదల బాగుండాలంటే తగినంత విటమిన్‌-సి అందేలా చూడాలి. సి - విటమిన్‌ శరీరంలో ఉత్పత్తి కాదు అలాగే శరీరంలో నిలువ ఉండదు. అందుకే రోజూ తగినంత సి-విటమిన్‌ లభించేలా మెనూ ప్లాన్‌ చేయాలి. పిల్లల్లో ఇమ్యూనిటీ బాగుండటానికి కూడా ఇది అవసరం. 

చర్మం, కండరాలు, ఎముకల ఎదుగుదలకు అవసరమైన కొల్లాజెన్‌ ఉత్పత్తికి సి- విటమిన్‌ సహాయపడుతుంది. 

పిల్లలు తీసుకున్న ఆహారంలోని ఐరన్‌ను శరీరం గ్రహించడానికి సి-విటమిన్‌ ఉపయోగపడుతుంది.

ఆరెంజ్‌, గ్రేప్‌ఫ్రూట్‌, టొమాటో, బ్రొక్కోలి, కివి వంటి వాటిలో సి- విటమిన్‌ పుష్కలంగా లభిస్తుంది. ఒక ఆరెంజ్‌లో 70 మి.గ్రా లభిస్తుంది. అందుకే పిల్లలకు పండ్లు, కూరగాయలు ఎక్కువగా పెట్టాలి.

వేగించడం ద్వారా సి- విటమిన్‌ నశిస్తుంది. కాబట్టి కొద్దిగా ఉడికించిన కూరగాయలను తినిపించడం అలవాటు చేయాలి. 

ఒకవేళ పిల్లలకు సరిపడా విటమిన్లు ఆహారం ద్వారా అందడం లేదు అనుకుంటే మాత్రల రూపంలో అందివ్వాలి.

పిల్లల్లో ఇమ్యూనిటీ పెరగడంతో పాటు సంపూర్ణ ఎదుగుదలకి సి-విటమిన్‌ అవసరమవుతుంది. 

Updated Date - 2021-06-17T16:55:20+05:30 IST