కేబీఎన్‌లో సీఏ శిక్షణా కేంద్రం

ABN , First Publish Date - 2022-07-02T06:31:20+05:30 IST

కాకరపర్తి భావన్నారాయణ కళాశాల ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఈనెల 6న సీఏ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు కళాశాల అధ్యక్ష కార్య దర్శులు తొమ్మండ్రు శేషయ్య, తూనుకుంట్ల శ్రీనివాసులు చెప్పారు.

కేబీఎన్‌లో సీఏ శిక్షణా కేంద్రం
పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న కేబీఎన్‌ నిర్వాహకులు

కేబీఎన్‌లో సీఏ శిక్షణా కేంద్రం 

వన్‌టౌన్‌, జూలై 1: కాకరపర్తి భావన్నారాయణ కళాశాల ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఈనెల 6న సీఏ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు కళాశాల అధ్యక్ష కార్య దర్శులు తొమ్మండ్రు శేషయ్య, తూనుకుంట్ల శ్రీనివాసులు చెప్పారు.శుక్రవారం కళాశాలలో విలేకరుల సమా వేశంలో వారిద్దరు మాట్లాడారు. ఆరు మాసాలు ఫౌండేషన్‌, ఆ తరువాత సీఏ శిక్షణలో వచ్చే 2023 ఫిబ్రవరిలో ప్రారంభిస్తామన్నారు. శిక్షణకు రూ. 16 వేలు నిర్ణయించామన్నారు. ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వి.నారాయణ రావు  మాట్లాడుతూ, ఇంటర్‌, డిగ్రీ, పీజీలకు సంబంఽ దించి సుమారు 25 కోర్సులను కళాశాలలో నిర్వహి స్తున్నామన్నారు. కోశాధికారి అన్నం రామకృష్ణారావు, వైఎస్‌ ప్రిన్సిపాల్‌ ఎం. వెంకటేశ్వరరావు, సీఎల్‌ రమేష్‌ , అధ్యాపకులు  ఏ.గోపాలకృష్ణ, సీనియర్‌ ఛార్టర్డ్‌ అకౌం టెంట్‌ కౌతా వెంకట సుబ్బారావు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-02T06:31:20+05:30 IST