హైదరాబాద్‌లో Money Heist గ్యాంగ్.. వారంతా మాస్కులు ధరించి ఏం చేసేవారంటే..

ABN , First Publish Date - 2022-02-17T05:44:34+05:30 IST

Netflix OTTలో Money Heist సినిమా(వెబ్ సిరీస్) అంటే తెలియనివారుండరు. ఆ సినిమాలోని పాత్రలు అంతలా ప్రచుర్యం పొందాయి. ఆ పాత్రలను ఇన్స్‌పిరేషన్‌గా తీసుకొని ఒక కారు డ్రైవర్ స్నేహితులతో కలిసి గ్యాంగ్ ఏర్పర్చుకున్నాడు. వారంతా వెబ్ సిరీస్‌లో పాత్రల లాగా మాస్కలు ధరించి ఎంతో తెలివిగా నేరాలు చేసేవారు...

హైదరాబాద్‌లో Money Heist గ్యాంగ్.. వారంతా మాస్కులు ధరించి ఏం చేసేవారంటే..

Netflix OTTలో Money Heist సినిమా(వెబ్ సిరీస్) అంటే తెలియనివారుండరు. ఆ సినిమాలోని పాత్రలు అంతలా ప్రచుర్యం పొందాయి. ఆ పాత్రలను ఇన్స్‌పిరేషన్‌గా తీసుకొని ఒక కారు డ్రైవర్ స్నేహితులతో కలిసి గ్యాంగ్ ఏర్పర్చుకున్నాడు. వారంతా వెబ్ సిరీస్‌లో పాత్రల లాగా మాస్కలు ధరించి ఎంతో తెలివిగా నేరాలు చేసేవారు. ఆ కారు డ్రైవర్ ఇంతకుమందు కొన్ని దొంగతనాలు చేసి జైలు శిక్ష అనుభవించి వచ్చాడు. 


వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌కు చెందిన గుంజపోగు సురేష్ అలియాస్ సూరి అనే యువకుడు 2011 నుంచి దొంగతనాలు, మోసాలు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 2018లో ఒక దొంగతనం కేసులో అతనికి జైలుకెళ్లాడు. 2020 ఫిబ్రవరిలో సూరి జైలు నుంచి విడుదల అయ్యాడు. అతనికి Netflix OTTలోని Money Heist వెబ్ సిరీస్‌లో ప్రొఫెసర్ పాత్ర బాగా నచ్చింది. అందులో ప్రొఫెసర్ తెలివిగా దొంగతనాలు ప్లానింగ్ చేస్తుంటాడు. దొంగతనాల సమయంలో ఏమైనా ప్రమాదాలు వస్తే వాటిని ముందుగానే పసిగట్టి ఎలా తప్పించుకోవాలో కూడా ప్లాన్ చేస్తాడు. 


సూరి కూడా ప్రొఫెసర్ పాత్ర లాగా ఆలోచించాడు. తనకంటూ స్నేహితులతో కలిసి ఒక గ్యాంగ్ ఏర్పర్చుకున్నాడు. ముందుగా తన వద్ద ఉన్న డబ్బుతో ఒక కారు కొన్నాడు. 24 గంటలూ ఆ కారులో జీవించేవాడు. కేవలం బాత్రూం, ఏదైనా అవసరమైనప్పుడే బయటికి వచ్చేవాడు. కారులో నగరమంతా తిరుగుతూ ధనికుల ఇంటిని గమనిస్తూ ఉండేవాడు. ధనిక పురుషులను టార్గెట్ చేసి వారికి ఫేస్ బుక్, వాట్సాప్ ద్వారా అమ్మాయిలాగా మెసేజ్‌లు పంపేవాడు. అందమైన అమ్మాయిలను కలవడానికి ఆ ధనిక పురుషులు రాగానే.. వారిని కిడ్నాప్ చేసేవాడు. ఆ తరువాత బాధితుల ఫోన్లతోనే  వారి కుటుంబ సభ్యులకు ఫోనే చేసి డబ్బులు అడిగేవాడు. 


బాధితుల కుటుంబసభ్యులు డబ్బులు ఇచ్చేందుకు వచ్చినప్పుడు వారిని ఒక ఫ్లై ఓవర్ కింద నిలబడి సూరిపై నుంచి ఒక తాడు వదిలేవాడు. ఆ తాడుకు ఫ్లైఓవర్ కిందినుంచి డబ్బులున్న బ్యాగును కట్టిపైకి పంపమనేవాడు. ఆ సమయంలో కిడ్నాప్ చేయబడిన వ్యక్తి ముఖానికి కూడా తమ గ్యాంగ్ సభ్యులలాగే మాస్క్ ధరింపచేసేవాడు. అలా తెలివిగా గత రెండు సంవత్సరాలలో ఇప్పటివరకు 14 కిడ్నాపింగ్‌లు చేశాడు. కానీ ఇటీవల ఆసిఫ్ నగర్‌లో ఒక యువకుడిని కిడ్నాప్ చేయగా.. ఆ యువకుడి తల్లి పోలీసులకు ఫిర్యదు చేసింది. 


పోలీసులు చాలా చాకచక్యంగా సూరి, అతని ముఠాని పట్టుకుంది. కానీ గ్యాంగ్‌లోని ఒక మహిళ తప్పించుకుంది. ప్రస్తుతం పోలీసులు పరారీలో ఉన్న ఆ మహిళ కోసం గాలిస్తున్నారు.


Updated Date - 2022-02-17T05:44:34+05:30 IST