'క్యాబ్ స్టోరీస్' ట్రైలర్ రిలీజ్ చేసిన తమన్నా

May 25 2021 @ 17:20PM

'బిగ్ బాస్' ఫేమ్ దివి వైద్య ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'క్యాబ్ స్టోరీస్'. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను హీరోయిన్ తమన్నా విడుదల చేశారు. "ఓవర్ ఎగ్జైట్మెంట్ ఓవర్ థింకింగ్.. ఈ రెండూ రిలేషన్‌జే కాదు.. ఆరోగ్యానికి కూడా హానికరం".. అనే డైలాగ్ ట్రైలర్‌లో ఆకట్టుకుంటోంది. క్యాబ్ ప్రయాణం నేపథ్యంలో తెరకెక్కించిన ఇందులో విలువైన బ్యాగ్ క్యాబ్‌లో మారిపోవడం వల్ల కొందరు వ్యక్తుల జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి.. అనే అంశాలను ఆసక్తికరంగా చూపించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో థ్రిల్లర్ అండ్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. తాజాగా విడుదలైన 'క్యాబ్ స్టోరీస్' ట్రైలర్ చూస్తే కూడా అదే అనిపిస్తోంది. తప్పకుండా ఈ సినిమా అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. కేవీఎన్ రాజేష్ దర్శకత్వం వహించిన ఇందులో గిరిధర్, ధన్ రాజ్, ప్రవీణ్, శ్రీహాన్, సిరి ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. కాగా 'స్పార్క్' ఓటీటీలో ఈ నెల 28న 'క్యాబ్ స్టోరీస్' స్ట్రీమింగ్ కాబోతోంది. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.