జగన్ ప్రభుత్వ బండారం బయటపెట్టిన కాగ్

ABN , First Publish Date - 2021-07-30T17:15:38+05:30 IST

అప్పు ఎందుకు తెస్తున్నారని అడిగితే చంద్రబాబు వల్ల అని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.

జగన్ ప్రభుత్వ బండారం బయటపెట్టిన కాగ్

అమరావతి: అప్పు ఎందుకు తెస్తున్నారని అడిగితే చంద్రబాబు వల్ల అని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. చంద్రబాబు ఆర్థిక అస్తవ్యస్థ విధానాలవల్లే అప్పు తెచ్చామని అంటున్న ప్రభుత్వం ఏప్రిల్‌లో ఈ ఏడాదికి సంబంధించి 53 శాతం అప్పులు లాగించేసింది. నవరత్నాల అమలుకు అందినకాడికి అప్పులు తీసుకువస్తున్నామని, అప్పు చేయనివారు ఎవరు ఉన్నారో చెప్పాలని ఆర్థిక మంత్రి బుగ్గన ప్రశ్నించగా.. ప్రభుత్వ ఆర్థిక సలహాదారు మాత్రం చంద్రబాబు అస్తవ్యస్థ విధానాలవల్లే అప్పు తెచ్చామని మాట మార్చారు. ఈ లోపు మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు కేంద్రం విడుదల చేసిన కాగ్ రిపోర్టులో ఏపీ ప్రభుత్వం అప్పుల కుప్పగా మారిందని తేల్చిపారేసింది.


ఏపీ ప్రభుత్వం చేతికి అందికనాడికి ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు చేస్తోంది. జీతాలు, పెన్షన్లు, వడ్డీలు, బిల్లుల చెల్లింపులు, సామాజిక భద్రత పెన్షన్ల కోసం ఎక్కువ వడ్డీ సయితం చెల్లించి అప్పులు తెస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా కాగ్ విడుదల చేసిన నెలవారీ నివేదికను పరిశీలించినవారికి ఆర్థికంగా ఏపీ పరిస్థితి ఎంత దిగజారిందో తెలిసిపోతుంది. ప్రభుత్వం ఎన్ని వివరణలు ఇచ్చినా గత ప్రభుత్వంపై నెట్టివేయాలని చూసినా.. నిజస్వరూపం ఏమిటో కాగ్ రిపోర్టు తేల్చేసింది.

Updated Date - 2021-07-30T17:15:38+05:30 IST