
అమరావతి: వైసీపీ ప్రభుత్వం చేసిన వ్యయంలో రూ. 48వేల కోట్లకు లెక్కా.. జమా లేదు. రాజ్యాంగ ప్రతిపత్తికలిగిన ఆడిట్ సంస్థ కాగ్ అధికారికంగా తన నివేదికలో తెలిపింది. జగన్ ప్రభుత్వానికి ఆడిట్ సర్టిఫికేట్ ఇవ్వడానికి కూడా కాగ్ భయపడింది. లెక్కలు అంతుపట్టనప్పుడు ఇచ్చే క్వాలిఫైడ్ ఒపీనియన్‌ను జగన్ ప్రభుత్వ జమా ఖర్చులపై కాగ్ ఇచ్చింది. దేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వంపై కాగ్ ఇటువంటి అభిప్రాయం వ్యక్తం చేయలేదు. అసెంబ్లీలో శుక్రవారం ప్రవేశపెట్టిన కాగ్ అకౌంట్స్‌లో ఈ విషయం స్పష్టంగా రాసి ఉంది. రాష్ట్ర బడ్జెట్లో 30 శాతం మొత్తానికి లెక్కలు లేకపోవడం ఆర్థిక అరాచకానికి పరాకాష్టగా చెబుతున్నారు.
రూ. 48వేల కోట్ల వ్యయానికి లెక్కలు దొరకడంలేదని విపక్షాలు కొన్ని నెలల కిందట చెబితే ఆర్థిక మంత్రి బుగ్గన ఎగతాళి చేశారు. ఇప్పుడు స్వయంగా కాగ్ ఇదే విషయం చెప్పింది. ప్రభుత్వం ఇష్టానుసారం లెక్కా.. జమా లేకుండా నిధులు దుర్వినియోగం చేస్తే... బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా చూస్తూ ఊరుకోబోమని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసి ఆర్థిక అవకతవకలపై విచారణ జరపాలని కోరతమాని ఆయన ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వం బాదుడు.. కేంద్రం ఉదారంగా ఇస్తున్న సాయంతో రాష్ట్ర ఆదాయం విపరీతంగా పెరిగిందని.. అయినా ఇదంతా ఎటుపోతోందో ఆర్థం కావడంలేదని పయ్యావుల దుమ్మెత్తిపోశారు.
ఇవి కూడా చదవండి