స్వర్ణముఖి కాజ్‌వేపై రాకపోకల నిషేధం

ABN , First Publish Date - 2020-11-27T06:00:06+05:30 IST

నివర్‌ తుఫాన్‌తో కురిసిన వర్షానికి స్వర్ణముఖినది కాజ్‌వేపై నీరు ప్రవహిస్తుండటంతో అధికారులు తాత్కాలికంగా రాకపోకలను నిషేధించారు.

స్వర్ణముఖి కాజ్‌వేపై రాకపోకల నిషేధం
స్వర్ణముఖినది కాజ్‌వేపై ప్రవహిస్తున్న నీటి ప్రవాహాన్ని పరిశీలిస్తున్న ఆర్డీవో సరోజిని

నాయుడుపేట, నవంబరు 26 : నివర్‌ తుఫాన్‌తో కురిసిన వర్షానికి స్వర్ణముఖినది కాజ్‌వేపై నీరు ప్రవహిస్తుండటంతో అధికారులు  తాత్కాలికంగా  రాకపోకలను నిషేధించారు. పై ప్రాంతం నుంచి చెరువులు తెగినా ఒక్కసారిగా నీరు ఉధృతంగా ప్రవహిస్తే కాజ్‌వేపై ప్రయాణించేవారికి ప్రాణాపాయస్థితి నెలకొంటుంది. దాంతో పోలీస్‌, రెవెన్యూ అధికారులు కాజ్‌వేపై రాకపోకలను  నిలిపివేశారు. ముందస్తుగా పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. స్వర్ణముఖినది నీటి పారుదల ఉధృతిని ఆర్డీవో సరోజిని, కమిషనర్‌ చంద్రశేఖర్‌రెడ్డి, సీఐ వేణుగోపాల్‌రెడ్డి, తహసీల్దారు శ్రీనివాసులు, ఎస్‌ఐ వెంకటేశ్వరరావు తదితర అధికారులు పరిశీలించారు. ఐదేళ్లుగా స్వర్ణముఖినదిలో సరైన నీటి పారుదలలేక ఎడారిని తలపిస్తూ ఉండేది. నివర్‌ పుణ్యమా అని స్వర్ణముఖినదిలో నీరు ప్రవహిస్తోంది. ప్రజలు ఆ ప్రవాహాన్ని  ఎంతో ఆసక్తిగా  తిలకించారు. అందుకోసం బారులు తీరారు.


Updated Date - 2020-11-27T06:00:06+05:30 IST