లెక్కతేలింది..!

Published: Tue, 25 Jan 2022 00:21:44 ISTfb-iconwhatsapp-icontwitter-icon

జిల్లాలో మొత్తం 6,75,784 మంది ఓటర్లు 

సర్వీసు ఓటర్లు 876 మంది 

3900 మంది కొత్త ఓటర్లుగా నమోదు 

వీరికి ఎపిక్‌ కార్డుల జారీ

నిర్మల్‌, జనవరి 24 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో కొత్తఓటరు నమోదు ప్రక్రియ పూర్తయ్యింది. ఇటీవలే 18 సంవత్సరాలు నిండిన వయోజనులంతా ఓటర్లుగా నమోదు చేసుకోవాలంటూ ఉన్నతాధికారులు సూచించిన నేపథ్యంలో దీనికి అనుగుణంగా యువత ఉత్సాహంగా ఓటరు నమోదులో పాల్గొన్నారు. మొత్తం 3900 మంది కొత్తఓటర్లుగా నమోదయ్యారు. వీరందరికి ఎపిక్‌కార్డులను అధికారులు అందజేస్తున్నారు. అలా గే సర్వీసు ఓటర్లుగా 876 మంది నమోదైనట్లు గుర్తించారు. దీంతో ప్రస్తు తం నిర్మల్‌, ఖానాపూర్‌, ముథోల్‌ నియోజకవర్గాలకు గాను 6,75,784 మంది ఓటర్లుగా నమోదై ఉన్నట్లు అఽధికారులు నిర్ధారించారు. అత్యధికంగా నిర్మల్‌ నియోజకవర్గంలో 2,39,335 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. అలాగే ముథోల్‌ నియోజకవర్గంలో 2,30,887 మంది ఓటర్లు ఉండగా ఖానాపూర్‌ 2,05,562 మంది ఓటర్లు నమోదై ఉన్నారు. నిర్మల్‌ నియోజకవర్గంలో 1,13,377 మంది పురుష ఓటర్లు కాగా 1,25,947 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. నిర్మల్‌ నియోజకవర్గంలోనే అత్యధిక మహిళ ఓటర్లు ఉండడం ప్రాఽధాన్యతను సంతరించుకుంటోంది. కాగా ముథోల్‌ నియోజకవర్గంలో పురుష ఓటర్లు 1,12,758 మంది కాగా మహిళ ఓటర్లు 1,18,106 మంది మహిళ ఓటర్లు ఉండగా ఖానాపూర్‌ నియోజకవర్గంలో 1,00,980 మంది పురుషులు, 1,04,571 మంది మహిళ ఓటర్లు ఉన్నారు. కాగా మూడు నియోజకవర్గాలకు గానూ మొత్తం 3,48,624 మంది మహిళఓటర్లు ఉండగా 3,27,115 మంది పురుష ఓటర్లున్నారు. 45మంది ఓటర్లు ఇతరులుగా నమోదయ్యారు. కాగా జిల్లాలో 876 మంది సర్వీసు ఓటర్లకు గానూ ఖానాపూర్‌లో అత్యధికంగా 392 మంది, నిర్మల్‌ నియోజకవర్గంలో 229 మంది, ముథోల్‌ నియోజకవర్గంలో 255 మంది సర్వీసు ఓటర్లుగా నమోదయ్యారు. మరో ఏడాదిన్నరలోపు సాధారణ ఎన్నికలు జరగనున్న కారణంగా ఓటరు నమోదు ప్రక్రియ ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. కొత్తగా యువత 3900 మందికి పైగా తామూ ఓటర్లుగా నమోదు చేసుకున్నారంటే ఓటు ప్రాధాన్యత వెల్లడవుతోంది. కాగా  ఓటర్లతో పాటు రాజకీయ పార్టీలు స్వచ్ఛందసంస్థలు, సంబంధిత అధికారులంతా కొత్తఓటర్లను లక్ష్యంగా చేసుకొని పెద్ద ఎత్తున అవగాహన కల్పించారు. గడువులోగా చాలా మంది దరఖాస్తులు చేసుకోగా ఈ దరఖాస్తులను పరిశీలించిన అధికారులు 3900 మందిని అర్హులుగా గుర్తించి వారికి ఎపిక్‌కార్డులను సిద్దం చేశారు. వీరందరికీ మొదట గణతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎపిక్‌ కార్డులను అందించనున్నారు. 

ఉత్సాహంగా కొత్తఓటర్లు

రాష్ట్రఎన్నికల సంఘం కొత్తఓటర్ల నమోదు కోసం చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌ విజయవంతం అయ్యింది. 18 సంవత్సరాలు నిండిన వారంతా ఓట ర్లుగా నమోదు చేసుకోవాలని ఊరు, వాడ పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టారు. ప్రతీ పోలింగ్‌బూత్‌స్థాయిలో అక్కడి బూత్‌లెవల్‌ అధికారి ఓటరు నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇలా ఉమ్మడి కృషి కారణంగా నిర్మల్‌, ముథోల్‌, ఖానాపూర్‌ నియోజకవర్గాల్లో 3900 మంది 18 సంవత్స రాలు పై బడిన వారు కొత్త ఓటరు జాబితాలో చోటు దక్కించుకున్నారు. 18 సంవత్సరాలు పై బడిన వారంతా తాము ఓటరుగా నమోదు చేసుకోవాలంటూ గ్రామస్థాయి నుంచి అధికారులు ప్రచారం నిర్వహించారు. దీనికి అనుగుణంగానే యువత నుంచి మంచి స్పందన లభించింది. వీరంతా ఉత్సాహంగా ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. 

మూడు నియోజకవర్గాల్లో మహిళ ఓటర్లే అత్యధికం

కాగా జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే అత్యధికులుగా ఉండడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. మొత్తం 6,75,784 మంది ఓటర్లకు గానూ 3,48,624 మంది మహిళా ఓటర్లు ఉండడంతో వారి ప్రాబల్యం వెల్లడవుతోందంటున్నారు. నిర్మల్‌ నియోజకవర్గంలో అత్యధికంగా 1, 25,947 మంది మహిళ ఓటర్లు ఉండగా, ఖానాపూర్‌ నియోజకవర్గంలో తక్కువగా 1,04,571 మంది ఓటర్లు ఉన్నారు. ముథోల్‌ నియోజకవర్గంలో 1,18,106 మహిళ ఓట ర్లు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. కాగా తక్కువ మహిళ ఓటర్లు ఉన్న ఖానాపూర్‌ నియోజకవర్గానికి మహిళ ప్రజా ప్రతినిధి ఎమ్మెల్యేగా కొనసాగుతుండగా అత్యధికంగా మహిళ ఓటర్లు ఉన్న నిర్మల్‌, ముథోల్‌ నియోజకవర్గాల్లో మాత్రం పురుషుల ఆధిపత్యం కొనసాగుతోంది. రాబో యే రోజుల్లో రిజర్వేషన్‌ల ప్రక్రియ అమలైతే ఓటర్ల లెక్కల ప్రకారం నిర్మ ల్‌ నియోజకవర్గం మహిళలకు రిజర్వ్‌ అయ్యే అవకాశాలు కూడా ఉన్నా యంటున్నారు. 

ఇతరులు 45 మంది

జిల్లాలో ఇతర ఓటర్లుగా 45 మంది నమోదు అయ్యారు. వీరిలో నుంచి ముథోల్‌ నియోజకవర్గంలో 23 మంది, ఖానాపూర్‌, నిర్మల్‌ నియోజకవర్గాల్లో 11 చొప్పున ఇతర ఓటర్లు నమోదైనట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. అలాగే 876 మంది సర్వీసు ఓటర్లకు గానూ అత్యధికంగా ఖానాపూర్‌ నియోజకవర్గంలో 392, నిర్మల్‌ నియోజకవర్గంలో 227, ముథోల్‌ నియోజకవర్గంలో 255 మంది సర్వీసు ఓటర్లు ఉన్నట్లు ప్రకటించారు. అధికారులు కొత్తగా నమోదైన ఓటర్లందరికీ ఎపిక్‌ కార్డులను జారీ చేయబోతున్నారు. సంబంధిత అధికారులే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజా ప్రతినిధులు, స్వచ్చంద సంస్థల సభ్యులు వివిధ రాజకీయ పార్టీల ప్రజా ప్రతినిధులు, నాయకులు ఓటరు నమోదుపై ప్రత్యేకదృష్టి సారించారు. విసృతస్థాయిలో ప్రచారం చేసిన కారణంగా ఓటు హక్కు విలువను చాలా మంది తెలుసుకొని ఓటర్లుగా నమోదయ్యేందుకు ఉత్సాహం చూపారంటున్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.