Birbhum violence కేసును సీబీఐకు అప్పగించండి...కోల్‌కతా హైకోర్టు ఆదేశం

Published: Fri, 25 Mar 2022 11:15:34 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Birbhum violence కేసును సీబీఐకు అప్పగించండి...కోల్‌కతా హైకోర్టు ఆదేశం

కోల్‌కతా: బీర్భూమ్ హింసాకాండ కేసును సీబీఐకు అప్పగించాలని కోల్‌కతా హైకోర్టు శుక్రవారం ఆదేశించింది.బెంగాల్‌లోని బీర్‌భూమ్‌లో రాంపూర్‌హట్‌లోని బొగ్తుయ్ గ్రామంలో ఇళ్లకు నిప్పుపెట్టడంతో 8 మంది మృతి చెందారు.ఈ కేసును బెంగాల్ రాష్ట్ర పోలీసులు దర్యాప్తు కొనసాగించలేరని హైకోర్టు పేర్కొంది. బీర్భూమ్ హింసాకాండ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌కు అప్పగించాలని హైకోర్టు పశ్చిమ బెంగాల్ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కోరింది.ఈ ఘటనపై ఏప్రిల్ 7వతేదీలోగా నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.మరో వైపు బిర్భూమ్ హింసాకాండపై రిటైర్డ్ ఎస్సీ జడ్జి నేతృత్వంలోని సిట్ విచారణ జరిపించాలని కోరుతూ హిందూ సేన అధ్యక్షుడు సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు.

Birbhum violence కేసును సీబీఐకు అప్పగించండి...కోల్‌కతా హైకోర్టు ఆదేశం

టీఎంసీ నాయకుడు హత్యకు గురైన తర్వాత ఈ సంఘటన జరిగింది. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మృతుల్లో నూతన వధూవరులు లిల్లీ ఖాతూన్. ఖాజీ సాజిదూర్ లు ఉన్నారు. శవపరీక్ష నివేదిక నివేదిక ప్రకారం బాధితులను సజీవ దహనం చేసే ముందు కొట్టారు.ఈ సంఘటన తర్వాత రాంపూర్‌హాట్‌లోని బొగ్టుయ్ గ్రామం నుంచి పలువురు పారిపోయారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు బెంగాల్ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. 

సిట్ ఇప్పటివరకు కనీసం 20 మందిని అరెస్టు చేసింది. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు.రాంపూర్‌హాట్ హింసాకాండపై స్టేటస్ రిపోర్టును ఈరోజు మధ్యాహ్నం 2 గంటల్లోగా సమర్పించాలని కోల్ కత్తా హైకోర్టు బెంగాల్‌ను కోరింది. జిల్లా జడ్జి సమక్షంలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, ఘటనా స్థలంలో 24 గంటలపాటు సీసీటీవీ నిఘా ఉంచాలని కోర్టు ఆదేశించింది. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

జాతీయంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.