కరోనా హాట్‌స్పాట్‌గా కాలిఫోర్నియా..!

ABN , First Publish Date - 2020-12-25T18:38:55+05:30 IST

అగ్రరాజ్యంలో మహమ్మారి కరోనా వైరస్ విలయం కొనసాగుతూనే ఉంది. ప్రతి రోజు రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇక కాలిఫోర్నియా రాష్ట్రమైతే ప్రస్తుతం కొవిడ్‌కు హాట్‌స్పాట్‌గా మారింది.

కరోనా హాట్‌స్పాట్‌గా కాలిఫోర్నియా..!

20 లక్షల మార్క్‌ను దాటిన కేసులు

కాలిఫోర్నియా: అగ్రరాజ్యంలో మహమ్మారి కరోనా వైరస్ విలయం కొనసాగుతూనే ఉంది. ప్రతి రోజు రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇక కాలిఫోర్నియా రాష్ట్రమైతే ప్రస్తుతం కొవిడ్‌కు హాట్‌స్పాట్‌గా మారింది. తాజాగా ఈ రాష్ట్రంలో కరోనా కేసులు 20 లక్షలకు చేరాయి. దీంతో ఈ మార్క్‌ను అందుకున్న అమెరికా తొలి రాష్ట్రంగా కాలిఫోర్నియా నిలిచింది. జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ డేటా ప్రకారం ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,010,004 మంది కొవిడ్ బారినపడగా.. 23,651 మంది మరణించారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో గవర్నర్ గేవిన్ న్యూసన్ ఈ నెల 5న కీలక నిర్ణయం తీసుకున్నారు.


అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రంలోని ఐదు ప్రాంతాల్లో 'సెల్ఫ్-ఐసోలేషన్' తప్పనిసరి చేశారు. రోజురోజుకీ కొత్త కేసులు గణనీయంగా పెరుగుతుండటంతో ఇంటెన్సివ్ కేర్ బెడ్స్ కొరత ఏర్పడింది. దీంతో గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే.. ప్రపంచంలోనే అత్యధిక కేసులు, మరణాలతో అగ్రస్థానంలో ఉన్న అమెరికాలో ఇప్పటి వరకు 1.90కోట్ల మందికి వైరస్ సోకగా.. ఇందులో 3.37లక్షల మంది మృతిచెందారు.    

Updated Date - 2020-12-25T18:38:55+05:30 IST