కాలిఫోర్నియాలో కరోనా కల్లోలం.. 6లక్షలు దాటిన కేసులు!

ABN , First Publish Date - 2020-08-16T03:22:14+05:30 IST

కరోనా వైరస్.. ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. అగ్రరాజ్యం అమెరికాలోనూ ఈ మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో అమెరికా

కాలిఫోర్నియాలో కరోనా కల్లోలం.. 6లక్షలు దాటిన కేసులు!

కాలిఫోర్నియా: కరోనా వైరస్.. ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. అగ్రరాజ్యం అమెరికాలోనూ ఈ మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో అమెరికా వ్యాప్తంగా 60వేలకుపైగా కరోనా కేసులు నమోదవ్వగా.. దాదాపు 1100 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో అమెరికాలో కొవిడ్ బారిన పడ్డ వారి సంఖ్య 54లక్షలు దాటింది. మహమ్మారికి బలైన వారి సంఖ్య 1.71లక్షలకు చేరింది. ఇదిలా ఉంటే.. కాలిఫోర్నియాలో ఇప్పటి వరకు నమోదైన కొవిడ్-19 కేసుల సంఖ్య 6లక్షలు దాటింది. కొవిడ్ కాటకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 11వేలు దాటింది. అమెరికాలో అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రాల జాబితాలో కాలిఫోర్నియా మొదటి స్థానంలో ఉంది. ఫ్లోరిడా, టెక్సాస్, న్యూయార్క్, జార్జియా రాష్ట్రాలు వరుసగా తర్వాత నాలుగు స్థానాల్లో ఉన్నాయి. అత్యధిక మరణాలు నమోదైన రాష్ట్రాల జాబితాలో న్యూయార్క్ మొదటి స్థానంలో ఉండగా.. న్యూజెర్సీ  రెండో స్థానంలో ఉంది. న్యూయార్క్‌లో కరోనా కారణంగా దాదాపు 33వేల మంది మృత్యువాతపడగా.. న్యూజెర్సీలో సుమారు 16వేల మంది మరణించారు. 


Updated Date - 2020-08-16T03:22:14+05:30 IST