కాలిఫోర్నియాలో కొవిడ్ విజృంభణ.. రికార్డు స్థాయిలో..!

ABN , First Publish Date - 2020-12-18T07:03:21+05:30 IST

అమెరికాలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. ప్రతి రోజు రికార్డు స్థాయిలో కొవిడ్ కేసులు నమో

కాలిఫోర్నియాలో కొవిడ్ విజృంభణ.. రికార్డు స్థాయిలో..!

వాషింగ్టన్: అమెరికాలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. ప్రతి రోజు రికార్డు స్థాయిలో కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఇదిలా ఉంటే.. కాలిఫోర్నియా రాష్ట్రం ప్రస్తుతం మహమ్మారికి హాట్‌స్పాట్‌గా మారింది. ఇండియా, జర్మనీ, బ్రిటన్ దేశాలలో నమోదైన కేసుల కంటే ఎక్కువ మొత్తంలో బుధవారం రోజు కాలిఫోర్నియాలో సంభవించాయి. ఒక్కరోజే సుమారు 41వేల మంది ప్రజలు కొవిడ్ బారినపడ్డట్టు నిర్ధారణ అయింది. కొవిడ్ బాధితులు పోటెత్తడంతో ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. కాగా.. కాలిఫోర్నియా రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఉన్న ఆస్పత్రుల్లో ఐసీయూల సామర్థ్యం బుధవారం 0.5శాతానికి పడిపోయింది. 


ఇదిలా ఉంటే.. గడిచిన 24 గంటల్లో ఏకంగా 3700 మంది మరణించగా.. 2.50 లక్షల కొత్త కేసులు నమోదైనట్లు జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ వెల్లడించింది. గత నెల రోజులుగా యూఎస్‌లో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో దేశంలో మహమ్మారి ప్రభావం మొదలైన మార్చి కంటే కూడా ప్రస్తుతం ఆస్పత్రిలో చేరుతున్న కరోనా బాధితుల సంఖ్య అధికంగా ఉందని యూఎస్ ఆరోగ్య, మానవ సేవల విభాగం పేర్కొంది.


Updated Date - 2020-12-18T07:03:21+05:30 IST