ltrScrptTheme3

Maskపై కాలిఫోర్నియా స్కూల్స్ కీలక నిర్ణయం!

Jul 11 2021 @ 12:02PM

శాన్‌ఫ్రాన్సిస్కో: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం పాఠశాలల్లో మాస్క్ ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కాలిఫోర్నియా డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్(సీడీపీహెచ్) శుక్రవారం ప్రకటించింది. వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు స్కూల్స్‌లో మాస్కులు వేసుకోవాల్సిన అవసరం లేదని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) ప్రకటించిన గంటల వ్యవధిలోనే సీడీపీహెచ్ ఈ ప్రకటన చేసింది. మాస్క్ ధరించడం అనేది విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడి, తిరిగి వారిని పాఠశాలలకు క్షేమంగా తీసుకురావాడానికి ఉన్న ఒక మంచి మార్గం అని కాలిఫోర్నియా హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ సెక్రెటరీ మార్క్ ఘాలీ పేర్కొన్నారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో సీడీసీ చెప్పినట్లు మూడు అడుగుల సామాజిక దూరం పాటించడం కూడా మేలు చేస్తుందని తెలిపారు. 

Follow Us on:

అమెరికా నగరాల్లోమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.