ఉద్యోగాన్ని కోల్పోయిన యూఎస్ టీచర్.. నోటి దురుసే కారణం!

ABN , First Publish Date - 2021-04-01T22:44:46+05:30 IST

కరోనా నేపథ్యంలో ఉద్యోగాలు దొరక్క కోట్లాది మంది అమెరికన్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఓ టీచర్ మాత్రం తన నోటి దురుసుతో చేతులారా ఉద్యోగాన్ని పోగొట్టుకున్న ఘటన కాలిఫోర్నియాలో

ఉద్యోగాన్ని కోల్పోయిన యూఎస్ టీచర్.. నోటి దురుసే కారణం!

కాలిఫోర్నియా: కరోనా నేపథ్యంలో ఉద్యోగాలు దొరక్క కోట్లాది మంది అమెరికన్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఓ టీచర్ మాత్రం తన నోటి దురుసుతో చేతులారా ఉద్యోగాన్ని పోగొట్టుకున్న ఘటన కాలిఫోర్నియాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మహమ్మారి కారణంగా అమెరికాలో విద్యార్థులు ప్రత్యేక్ష తరగతులకు హాజరుకావడం లేదు. జూమ్ యాప్ ద్వారానే ఆన్‌లైన్‌లోనే క్లాసులు వింటున్నారు. కాగా.. కాలిఫోర్నియాకు చెందిన కింబర్లీ న్యూమాన్ అనే టీచర్ తాజాగా ఓ ఆరో తరగతి విద్యార్థికి జూమ్ ద్వారా బోధించింది. క్లాస్ ముగిసిన తర్వాత జూమ్ మీటింగ్ నుంచి ఎగ్జిట్ కావడం మర్చిపోయి కింబ్లరీ న్యూమాన్.. సదరు విద్యార్థి, తల్లిదండ్రులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జాతిపేరుతో  దూషించారు. కాగా.. కింబ్లరీ న్యూమాన్ మాటల్ని సదరు విద్యార్థి తల్లి కట్రా స్టోక్స్ రికార్డు చేశారు. అంతేకాకుండా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన స్కూల్ యాజమాన్యం కింబ్లరీ న్యూమాన్‌ను విధుల నుంచి తొలగించారు. 


Updated Date - 2021-04-01T22:44:46+05:30 IST