కాల్‌బాయ్‌గా చెప్పుకొని కటకటాలపాలయ్యాడు!

ABN , First Publish Date - 2021-06-08T12:09:47+05:30 IST

ఆన్‌లైన్‌లో తనను తాను కాల్‌బోయ్‌గా చెప్పుకున్న యువకుడు..

కాల్‌బాయ్‌గా చెప్పుకొని కటకటాలపాలయ్యాడు!

హైదరాబాద్‌ సిటీ : ఆన్‌లైన్‌లో తనను తాను కాల్‌బోయ్‌గా చెప్పుకున్న యువకుడు.. ఓ యువతిని వేధించి సైబర్‌ క్రైం పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్‌నగర్‌ జిల్లా నారాయణపేటకు చెందిన తుమ్ము భరత్‌కుమార్‌ డిగ్రీ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్నాడు. అశ్లీల చిత్రాలు చూడటానికి అలవాటుపడిన యువకుడు పలు వెబ్‌సైట్లలో తనను తాను కాల్‌బోయ్‌గా చెప్పుకున్నాడు. వెబ్‌సైట్లలో, ఇతర డేటింగ్‌ సైట్లలో ఫోన్‌నంబర్‌ అప్‌లోడ్‌ చేసుకున్నాడు. అయినా మహిళల నుంచి పెద్దగా స్పందన రాకపోవడంతో చాటింగ్‌ చేసే యువతుల కోసం వెతికాడు. 


చివరకు ఓ యువతితో చాటింగ్‌ మొదలు పెట్టాడు. కొద్దిరోజులు బాగానే చాటింగ్‌ చేసిన తర్వాత ఆమె వ్యక్తిగత ఫొటోలు ఫ్యామిలీ ఫొటోలు తీసుకున్నాడు. ఆ తర్వాత నకిలీ ఇన్‌స్టాగ్రామ్‌ సృష్టించాడు. వారి ఫొటోలను కాంటాక్టు నంబర్‌లు సోషల్‌మీడియాలో పోస్టు చేసేవాడు. అడిగినంత డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు. అసభ్య, అశ్లీల మెసేజ్‌లు పోస్టు చేసి వేధించేవాడు. వేధింపులు భరించలేని ఆ యువతి రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు టెక్నికల్‌ ఎవిడెన్స్‌ ఆధారంగా నిందితుడిని అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు.

Updated Date - 2021-06-08T12:09:47+05:30 IST