ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు

Sep 20 2021 @ 01:04AM

అభినందనలు తెలిపిన కలెక్టర్‌ 

కర్నూలు(కలెక్టరేట్‌), సెప్టెంబరు 19: జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌  ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అథారిటీ పి.కోటేశ్వరరావు తెలిపారు.  సహకరించిన జిల్లా స్థాయి ఎన్నికల అధికారులు, ఇనచార్జి అధికారులు, అభ్యర్థులు, ఏజెంట్లు, విలేకరులకు ధన్యవాదాలు, అభినందనలు తెలిపారు. 44 మండలాల్లో 484 ఎంపీటీసీ, 36 జడ్పీటీసీ స్థానాలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైందని తెలిపారు. కౌంటింగ్‌ కేంద్రాల్లో పారదర్శకంగా ఓట్ల లెక్కింపు జరిగిందని, అందరి సహకారంతో విజయవంతంగా పూర్తి చేశామని పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియను కలెక్టర్‌ పర్యవేక్షించారు. 14 మంది లైజన అధికారులు తమకు కేటాయించిన మండలాల నుంచి ఎప్పటికప్పుడు ఫలితాలను సేకరించి విడుదల చేశారు. కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో జాయింట్‌ కలెక్టర్లు రామసుందర్‌ రెడ్డి, డా.మనజీర్‌ జిలానీ సామూన, నారపురెడ్డి మౌర్య, శ్రీనివాసులు, అసిస్టెంట్‌ కలెక్టర్‌ నూరుల్‌ ఖమర్‌, జడ్పీ సీఈవో వెంకటసుబ్బయ్య, డీపీవో ప్రభాకర్‌ రావు విధులు నిర్వర్తించారు. 



Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.