అంగన్‌వాడీ పోస్టులకు ప్రశాంతంగా ఇంటర్వ్యూలు

ABN , First Publish Date - 2022-10-02T05:07:15+05:30 IST

మదన పల్లె రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని 11 మండాలల్లోని అంగన్‌వాడీ పోస్టులకు సంబంధించి ఇంటర్వ్యూలను ప్రశాం తంగా నిర్వహించారు.

అంగన్‌వాడీ పోస్టులకు ప్రశాంతంగా ఇంటర్వ్యూలు
అభ్యర్థిని ఇంటర్వ్యూ చేస్తున్న ఆర్డీవో మురళి

మదనపల్లె టౌన్‌, అక్టోబరు 1: మదన పల్లె రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని 11 మండాలల్లోని అంగన్‌వాడీ పోస్టులకు సంబంధించి ఇంటర్వ్యూలను ప్రశాం తంగా నిర్వహించారు. శనివారం స్థానిక సబ్‌కలెక్టరేట్‌లో ఆర్డీవో ఎంఎస్‌ మురళి అంగన్‌వాడీ పోస్టులకు దరఖా స్తు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ లు నిర్వహించారు. మదనపల్లె, తంబళ్లపల్లె ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధితో పా టు, వాల్మీకిపురం, కలికిరి, రామసముద్రం మండలాల్లో ఖాళీగా ఉన్న అంగన్‌ వాడీ కార్యకర్తలు, మినీ అంగన్‌వాడీలు, హెల్పర్‌లు కలిపి 75 పోస్టులకు ఇం టర్వ్యూలు నిర్వహించగా 100 మంది పాల్గొన్నారు.  ఐసీడీఎస్‌ పీడీ నిర్మల, సీడీపీవోలు సుజాత, నాగవేణి, భారతి, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-02T05:07:15+05:30 IST