ప్రశాంతంగా పాలిసెట్‌

ABN , First Publish Date - 2022-07-01T05:27:25+05:30 IST

తెలంగాణ సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పాలిసెట్‌ ప్రవేశపరీక్ష గురువారం ప్రశాంతగా ముగిసింది.

ప్రశాంతంగా పాలిసెట్‌
జిల్లా కేంద్రాంలోని పరీక్ష కేంద్రాలను పరిశిలిస్తున్న కోఆర్డినేటర్‌ నాగరాజు

 మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం జూన్‌ 30  : తెలంగాణ సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పాలిసెట్‌ ప్రవేశపరీక్ష గురువారం ప్రశాంతగా ముగిసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 44 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. పరీక్షకు ఒక్క నిమిషం అలస్యమైన అనుమతి లేదన్న నిబంధన ఉండటంతో విద్యార్థులు పరీక్ష సమయానికి ముందుగానే కేంద్రాలకు చేరుకున్నారు.  ఉదయం 11 గంటలకు ప్రారంభమైన పరీక్ష   మధాహ్నం 1:30 గంటలకు ముగిసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 11,815 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 11,342 మంది విద్యార్థులు హాజరయ్యారు.  91.86 శాతం విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు అధికారులు తెలిపారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రాలో నిర్వహించిన తొమ్మిది పరీక్ష కేంద్రాలలో 3,526 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 3,239 మంది హాజరయ్యారు. ఇందులో బాలురు 1,860 మంది ఉండగా, బాలికలు 1,379 మంది ఉన్నారు  పరీక్ష కేంద్రాలను పాలిటెక్నిక్‌ పరీక్షల కోఆర్టినేటర్‌ నాగరాజు పర్యవేక్షించారు.  


Updated Date - 2022-07-01T05:27:25+05:30 IST