ప్రశాంతంగా పాలిసెట్‌

ABN , First Publish Date - 2022-07-01T05:51:46+05:30 IST

సంగారెడ్డి, మెదక్‌ జిల్లాలో గురువారం జరిగిన పాలిసెట్‌ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది.

ప్రశాంతంగా పాలిసెట్‌

ఆలస్యంగా వచ్చిన ఐదుగురికి అనుమతి నిరాకరణ


సంగారెడ్డిఅర్బన్‌/మెదక్‌అర్బన్‌,జూన్‌30: సంగారెడ్డి, మెదక్‌ జిల్లాలో గురువారం జరిగిన పాలిసెట్‌ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. సంగారెడ్డిలో 10, జోగిపేట-1, జహీరాబాద్‌లో 3 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. సంగారెడ్డి, జోగిపేట కేంద్రాల్లో 2,931 మందికి 2,680 మంది హాజరయ్యారు. జహీరాబాద్‌లోని 3 పరీక్షా కేంద్రాల్లో 822 మందికి 763 మంది హాజరైనట్లు జిల్లా సమన్వయకర్త శ్రీనివాసులు, సహాయ సమన్వయకర్త మల్లికార్జున్‌, జహీరాబాద్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ కుమార స్వామి తెలిపారు. సెంటర్లను స్టేట్‌ స్పెషల్‌ అబ్జార్వర్‌ కె.నవీన్‌కుమార్‌, సంగారెడ్డి ఎంఈవో వెంకటనర్సింహులు, జహీరాబాద్‌ తహసీల్దార్‌ కృపాదానం తనిఖీ చేశారు. సంగారెడ్డి శాంతినగర్‌లోని సెయింట్‌ ఆంథోనీస్‌ హైస్కూల్‌లో ఆలస్యంగా వచ్చిన ముగ్గురు, సెయింట్‌ ఆంథోనీస్‌ కళాశాలలో ఇద్దరు విద్యార్థులు మూడు నిమిషాలు ఆలస్యంగా రావడంతోఅనుమతించలేదు. మెదక్‌ జిల్లాలో ఏడు పరీక్షకేంద్రాల్లో నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 2,182 మంది విద్యార్థులకు 2,053 మంది హాజరైనట్లు కోఆర్డినేటర్‌ సువర్ణలత తెలిపారు.

Updated Date - 2022-07-01T05:51:46+05:30 IST