ప్రశాంతంగా పోలింగ్‌

ABN , First Publish Date - 2020-10-10T09:28:46+05:30 IST

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా స్థానిక సం స్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది.

ప్రశాంతంగా పోలింగ్‌

ప్రశాంతంగా ముగిసిన ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక 

హైదరాబాద్‌ క్యాంపుల నుంచి నేరుగా పోలింగ్‌ కేంద్రాలకు వచ్చిన ప్రజాప్రతినిధులు

ఓటు హక్కు వినియోగించుకున్న అసెంబ్లీ స్పీకర్‌ పోచారం, మంత్రి ప్రశాంత్‌రెడ్డి, విప్‌ గంప గోవర్ధన్‌, ఎంపీ అర్వింద్‌, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

పోస్టల్‌ బ్యాలెట్‌, పీపీఈ కిట్లతో ఓటు వేసిన పలువురు కరోనా బాధితులు

కామారెడ్డి, బోధన్‌లో ఓటింగ్‌ సరళిని పరిశీలించిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని కవిత

బందోబస్తును పర్యవేక్షించిన సీపీ కార్తికేయ,  కామారెడ్డి ఎస్పీ శ్వేతారెడ్డి

టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని కవిత గెలుపు లాంఛనమే!


( ఆంధ్రజ్యోతి ప్రతినిధి/నిజామాబాద్‌, కామారెడ్డి): ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా స్థానిక సం స్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి జిల్లా పరిధిలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాలకు క్యాంపుల నుంచి స్థానిక సంస్థలకు చెందిన జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్‌లు, కార్పొరేటర్లు, ఎక్స్‌ అఫీషియో సభ్యులు తరలివ చ్చారు. నిర్ణీత షెడ్యూల్‌కు అనుగుణంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉప ఎన్నికలో ఎక్స్‌ అఫీ షియో సభ్యులు అయిన అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, విప్‌ గంప గోవర్ధన్‌, ఎ మ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఓటు వేశారు. ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్ని క ఉమ్మడి జిల్లాలో ఉత్కంఠ రేపగా అధికార పార్టీ నేతలు తమ వ్యూహం ఫలించడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఉ ప ఎన్నికలో అధికార పార్టీ నేతలు తమ సభ్యులతో మంత నాలు జరిపి పార్టీలో చేర్చుకున్నారని బీజేపీ, కాంగ్రెస్‌ నేత లు ఆరోపించారు.


ఈ ఉప ఎన్నిక కోసం కామారెడ్డి, నిజామాబాద్‌ ఉభయ జిల్లాల్లో 50 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 100 శాతం పోలింగ్‌ పూర్తి అయింది. ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి బాన్సువాడలో ఓటు వేశారు. మంత్రి ప్రశాంత్‌ రెడ్డి భీమ్‌గల్‌లో ఓటు వేశారు. విప్‌ గంప గోవర్ధన్‌ కామారెడ్డిలో ఓటు వేశారు. ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్‌, బిగాల గణేష్‌ గుప్తా, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు వీజీ గౌడ్‌, రాజేశ్వర్‌రావు, ఆకుల లలిత నిజామాబాద్‌ జడ్పీలో త మ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బోధన్‌లో ఎ మ్మెల్యే షకీల్‌, ఎల్లారెడ్డిలో ఎమ్మెల్యే సురేందర్‌ తమ ఓటు వేశారు. ఎంపీ ధర్మపురి అర్వింద్‌ తన ఓటును నిజామాబా ద్‌లో వేశారు. నిజామాబాద్‌ జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌ రావు మాక్లూర్‌లో, కామారెడ్డి జడ్పీ చైర్‌ పర్సన్‌ దఫేదార్‌ శోభరాజు నిజాంసాగర్‌లో ఓటు వేశారు.


ఉప ఎన్నిక సందర్భంగా పకడ్బందీ ఏర్పాట్లు

ఉప ఎన్నిక సందర్భంగా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. కరోనా నేపథ్యంలో అన్ని పోలింగ్‌ కేంద్రాలను శాని టైజ్‌ చేశారు. పోలింగ్‌ సిబ్బందికి కరోనా కిట్‌లను అందించా రు. ముందు రోజే పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది షెడ్యూల్‌కు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 గంటలకు పోలింగ్‌న ప్రారంభించారు. ఉమ్మడి జిల్లా పరిధి లో కొన్ని మినహా మెజారిటీ పోలింగ్‌ కేంద్రాలలో పదిలోపే ఓట్లు ఉండడంతో పోలింగ్‌ త్వరగా పూర్తయింది. ఉమ్మడి జి ల్లా పరిధిలో అత్యధికంగా నిజామాబాద్‌ జడ్పీ పోలింగ్‌ కేం ద్రంలో 67 ఓట్లు ఉండగా.. చందూర్‌ మండలంలో కేవలం నాలుగు ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఈ పోలింగ్‌ కేంద్రాలలో అన్నిటి నుంచి వెబ్‌ క్యాస్టింగ్‌ చేశారు. ఈ ఎన్నికల రిటర్ని ంగ్‌ అధికారి, నిజామాబాద్‌ కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి కలెక్టరే ట్‌ నుంచి పోలింగ్‌ సరళిని పరిశీలించారు. కామారెడ్డి కలె క్టర్‌, ఇతర అధికారులు పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు.


భారీ పోలీసు బందోబస్తు

పోలింగ్‌ సందర్భంగా ఉమ్మడి జిల్లా పరిధిలో భారీ పోలీ సు బందోబస్తును ఏర్పాటు చేశారు. మొత్తం 50 పోలింగ్‌ కేంద్రాల వద్ద సుమారు వెయ్యి మంది పోలీసులను విని యోగించారు. నిజామాబాద్‌ పోలీసు కమిషనర్‌ కార్తికేయ, కామారెడ్డి ఎస్పీ శ్వేతారెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహిం చారు. ఉమ్మడి జిల్లాకు చెందిన అదనపు ఎస్పీలు, ఏసీపీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు బందోబస్తులో పాల్గొన్నారు.


పోలింగ్‌ కేంద్రాలకు వచ్చిన టీఆర్‌ఎస్‌ నేతలు

ఉమ్మడి జిల్లా పరిధిలోని టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు ని యోజకవర్గాల వారీగా క్యాంపుల నుంచి ప్రత్యేక వాహనాల ద్వారా నేరుగా పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లారు. ఓటు వేసిన త ర్వాతనే తమ ఇళ్లకు వెళ్లారు. ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధు ల వెంటే క్యాంపు నుంచి మంత్రి ప్రశాంత్‌రెడ్డి, విప్‌ గంప గోవర్ధన్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు వచ్చారు. తమ ఓట్లు చీలకుండా ప్రతీ పోలింగ్‌ కేంద్రం వద్ద కు సీనియర్‌ ప్రజాప్రతినిధులను, నేతలను వెంట పంపారు. తమ పార్టీ అభ్యర్థికి వన్‌ సైడ్‌ మెజారిటీ వచ్చేందుకు ప్రయ త్నం చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన వా రు కూడా వారి వెంటనే వచ్చి ఓటు హక్కును వినియోగిం చుకున్నారు. బీజేపీ ప్రజాప్రతినిదులు కూడా ఎంపీ అర్వింద్‌ వెంట నేరుగా క్యాంపు నుంచి పోలింగ్‌ కేంద్రాలకు తరలి వ చ్చారు. తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమ ప్రజా ప్రతినిధుల వెంట ఆ పార్టీ నేతలు పోలింగ్‌ కేంద్రాల కు వెళ్లారు. తమ పార్టీ ఓట్లు చీలకుండా ప్రయత్నాలు చేశా రు. ఈ ఉప ఎన్నిక పోలింగ్‌ సందర్భంగా ఎక్కడా కాంగ్రెస్‌ నేతల హడావుడి కనిపించలేదు. పోటీలో ఉన్న అభ్యర్థి వడ్డే 


పోలింగ్‌ను పరిశీలించిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని కవిత

 ఉప ఎన్నిక పోలింగ్‌ను టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని కల్వకుంట్ల కవిత పరిశీలించారు. హైదరాబాద్‌ నుంచి నేరుగా కామారె డ్డికి చేరుకున్న ఆమె విప్‌ గంప గోవర్ధన్‌తో కలిసి పోలింగ్‌ కేం ద్రానికి వెళ్లారు. ఓటింగ్‌ సరళిని పరిశీలించారు. అక్కడి నుంచి నేరుగా బోధన్‌ చేరుకున్న ఆమె ఎంపీడీవో కార్యాలయంలో ఎమ్మెల్యే షకీల్‌ తో కలిసి పరిశీలించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి వడ్డేపల్లి సుభాష్‌ రెడ్డి కామారెడ్డి, లింగంపేట, ఎల్లారెడ్డి పో లింగ్‌ కేంద్రాలను పరిశీలించారు.


టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కవిత గెలుపు లాంఛనమే..

ఈ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కవిత గెలుపు లాం ఛనమే. పోలింగ్‌ సరళిని బట్టి ఆమెకు భారీ ఆధిక్యత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఉప ఎన్నికలో మొత్తం 824 ఓట్లలో ఆమెకు 700లకుపైగా ఓట్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లా నేతల వ్యూహంతో వారి ఓట్లతో పాటు ఇతర పార్టీల మద్దతు వల్ల ఓట్ల శాతం మరింత పె రగనుంది. ఉమ్మడి జిల్లా పరిధిలో కాంగ్రెస్‌, బీజేపీకి కలిపి 230 ఓట్లు ఉన్నా.. వారిలో చాలా మంది టీఆర్‌ఎస్‌లో చేరడ ం, మద్దతు ఇవ్వడం వల్ల ఓట్ల శాతం పెరగనుంది. 

Updated Date - 2020-10-10T09:28:46+05:30 IST