ప్రశాంతంగా పాలీసెట్‌

ABN , First Publish Date - 2022-07-01T06:24:39+05:30 IST

ప్రశాంతంగా పాలీసెట్‌

ప్రశాంతంగా పాలీసెట్‌
కొంపల్లి పాలిటెక్నిక్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న ప్రత్యేక పరిశీలకుడు రామకృష్ణ


  • 91.52శాతం మంది విద్యార్థుల హాజరు 
  • ఆలస్యంగా వచ్చి అనుమతి లభించని నలుగురు విద్యార్థులు
  • పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన ప్రత్యేక పరిశీలకుడు


వికారాబాద్‌, జూన్‌ 30(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి గురువారం నిర్వహించిన పాలిటెక్నిక్‌ కోర్సు ప్రవేశ పరీక్ష(పాలీసెట్‌-2022) ప్రశాంతంగా ముగిసింది.వికారాబాద్‌లో ఏర్పాటు చేసిన నాలుగు పరీక్షా కేంద్రాల్లో 1,616 మంది విద్యార్థులు ఎంట్రెన్స్‌ రాయాల్సి ఉండగా 1,479 మంది హాజరయ్యారు. 137 మంది గైర్హాజరయ్యారు. పాలీసెట్‌కు దరఖాస్తు చేసుకున్న వారిలో 91.52శాతం మంది హాజరయ్యారు. 894 మంది బాలురకు 817 మంది.. 722 మంది బాలికలకు 662 మంది పరీక్ష రాశారు. ఎస్‌ఏపీ కళాశాల కేంద్రంలో 600 మందికి 557 మంది పరీక్ష రాశారు. భృంగీ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ కేంద్రంలో 550 మంది విద్యార్థులకు 506 మంది, కొత్తగడి టీఎ్‌సడబ్ల్యుఆర్‌ఎస్‌ కేంద్రంలో 250 మంది విద్యార్థులకు 231 మంది, కొంపల్లిలోని పాలిటెక్నిక్‌ కళాశాలలో 216 మంది అభ్యర్థులకు 185 మంది ప్రవేశ పరీక్ష రాశారు.

ఆలస్యంగా వచ్చి పరీక్ష రాసే అవకాశం కోల్పోయిన నలుగురు

నిర్ణీత సమయం కంటే ఆలస్యంగా వచ్చిన నలుగురు విద్యార్థులు పాలిసెట్‌ పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయారు. ఉదయం 11గంటలకు పరీక్ష ప్రారంభం కాగా.. ఎస్‌ఏపీ కళాశాల పరీక్షా కేంద్రానికి ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన నలుగురు విద్యార్థులను లోనికి అనుమతించలేదు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రవేశపరీక్ష నిర్వహించారు. కేంద్రాల్లో పరీక్ష నిర్వహణ తీరును పాలిసెట్‌ జిల్లా కోఆర్డినేటర్‌ ఎం.పరమేశ్వర్‌, నిఘా అధికారి బాబుసింగ్‌ తనిఖీ చేశారు. పాలిసెట్‌ జిల్లా ప్రత్యేక పరిశీలకుడిగా నియామకమైన హైదరాబాద్‌లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల అధికారి రామకృష్ణ కేంద్రాలను తనిఖీ చేశారు. ఎగ్జాం సెంటర్ల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Updated Date - 2022-07-01T06:24:39+05:30 IST