తగ్గని కరోనా ఉధృతి

ABN , First Publish Date - 2020-09-10T11:14:00+05:30 IST

తగ్గని కరోనా ఉధృతి

తగ్గని కరోనా ఉధృతి

  జిల్లాలో తగ్గని తీవ్రత  పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు

 అవసరాల కోసం వచ్చేవారికిఎక్కువగా సోకుతున్న వైరస్‌

నిజామాబాద్‌, సెప్టెంబరు 9


 (ఆంధ్రజ్యోతి ప్రతి నిధి): జిల్లాలో కరోనా వైరస్‌ తీవ్రత తగ్గడం లేదు. ప్రజలు అవసరాలు, వ్యాపారం, ఉద్యోగం కోసం బ యటకు వస్తుండంతో  కేసుల సంఖ్య భారీగా పెరు గుతోంది. ప్రతి రోజూ గ్రామాలు, మున్సిపాలిటీల పరిధిలో కేసులు బయట పడుతున్నాయి. జిల్లాలో వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉండడం వల్ల పలు కు టుంబాల వారు కరోనా బారిన పడుతున్నారు.


కరోనా పాజిటివ్‌ వచ్చిన వారిలో లక్షణాలు తక్కువగా ఉండడంతో ఎక్కువ మంది హోంక్వారంటైన్‌లో ఉం డి చికిత్స పొందుతున్నారు. తీవ్రంగా ఉన్న వారు ఆ సుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. జిల్లాలో గడిచిన నెలన్నర రోజుల నుంచి కేసుల సంఖ్య భారీ గా పెరుగుతోంది. ర్యాపిడ్‌ టెస్టులు పెంచిన తర్వాత మరింత పెరిగాయి.


మున్సిపాలిటీలతో పోల్చితే గ్రా మాల పరిధిలో గడిచిన పదిహేను రోజులుగా కేసు ల సంఖ్య భారీగా పెరుగుతోంది. పలు గ్రామాల ప రిధిలో నిత్యం ఈ కేసులు పెరుగుతున్నాయి. నిత్యం వంద నుంచి రెండు వందల వరకు పైననే కేసులు వస్తున్నాయి. ఎక్కువ మంది తప్పనిసరి పరిస్థితుల్లో బటయకు వస్తుండడంతో వైరస్‌ భారిన పడుతు న్నారు. మరి కొంత మంది పెళ్లిళ్లు, ఇతర కార్యక్ర మాలకు హాజరుకావడం వల్ల కరోనా బారి న పడు తున్నారు.


గడిచిన నెల రోజుల నుంచి కరోనా వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉంది. సామూహికంగా కుటుం బాల వారు కరోనా భారీన పడుతున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 8140కు పైగా కేసులు నమోదయ్యా యి. వీటిలో ఎక్కువ శాతం కేసులు ఆగస్టు నెలలోనే వచ్చాయి. నెలల తరబడి ఇళ్లలో ఉండలేక అవసరా ల కోసం బయటకు వచ్చే వారికి ఈ వైరస్‌ ఎక్కువ గా సోకుతోంది. వీరి ద్వారా కుటుంబసభ్యులకు కూ డా కరోనా వస్తోంది.


తప్పనిసరి పరిస్థితుల్లో బయ టకు వచ్చే వారు జాగ్రత్తలు తీసుకున్న కొంత మం దికి వస్తోంది. గడిచిన కొన్ని రోజులుగా ఎక్కువగా వ్యాపారులు, దుకాణాల్లో పనిచేసే వారికి, ఎక్కువ దూరం ప్రయాణం చేసే వారికి ఈ వైరస్‌ సోకుతు న్నట్లు వైద్యులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో పరీ క్షల సంఖ్యను పెంచినప్పటి నుంచి కేసులను పరి శీలిస్తే పాజిటివ్‌ వచ్చిన వారిలో 80 శాతం మందికి లక్షణాలు తక్కువగా ఉంటున్నాయి.


వీరిలో కొంత మందికి జ్వరం, దగ్గు, ఇతర లక్షణాలు ఏవీ ఉండడం లేదు. కొద్ది మంది మా త్రం లక్షణాలు తీవ్రంగా ఉండడంతో పాటు ఆక్సిజన్‌ శాతం భారీగా పడిపోతోంది. ఆసు పత్రిలో చేరడం ఆలస్యం అయినా వారు మృ త్యువాత పడుతున్నట్లు వైద్యులు తెలిపారు. దగ్గు, జ్వరం తీవ్రత తగ్గని వారు వెంటనే ఆసుపత్రిలో చేరాలని వైద్యులు సూచిస్తు న్నారు. పాజిటివ్‌ వచ్చిన వారికి పీ హెచ్‌సీలలోనే హోం క్వారంటైన్‌ కి ట్‌లను అందిస్తున్నారు. బాగా లక్షణా లు ఉన్న వారు ఆసు పత్రుల్లో చేరు తున్నారు.


జిల్లా జనరల్‌ ఆసుప త్రిలోనూ 230 మందికి పైగా చికిత్స పొందుతున్నారు. వైద్యులు మాత్రం బయటకు వెళ్లేవారు అన్ని జాగ్రత్త లు తీసుకోవాలని కోరుతున్నారు. కరో నా లక్షణాలు తీవ్రంగా ఉన్న వారు ని ర్లక్ష్యం చేయకుండా ఆసుపత్రిలో చేరా లని కోరుతున్నారు.


డాక్టర్‌ సుదర్శనం డీఎంహెచ్‌వోగా మళ్లీ బాధ్యతలు

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా మళ్లీ డాక్టర్‌ సుదర్శనంకే బాధ్యతలను అప్పజెప్పుతూ రాష్ట్ర పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌ ఉత్తర్వులను బుధవారం జారీ చేశారు. గత నెల మొదటి వారంలో వ్యక్తిగత పనుల నిమిత్తం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా ఉన్న ఆయన లీవ్‌పై  వెళ్లారు.


ఆయన అదే నెల 31న తిరిగి జిల్లా అదనపు వైద్య, ఆరోగ్యశాఖ అధికారిగా తన పోస్టులో చేరారు. ఆయన సెలవులో ఉన్న సమయంలో ఆర్మూర్‌ డిప్యూటీ డీఎంహెచ్‌వోకు డాక్టర్‌ రమేష్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పజెప్పారు.  ఆయన నెల రోజుల పాటు సమర్ధవంతంగా సేవలు అందించారు. టెస్టుల సంఖ్యను పెంచడంతో పాటు పాజిటివ్‌ వచ్చిన వారికి వైద్య సేవలు అందేలా చూశారు.


అదనపు డీఎంహెచ్‌వోగా ఉన్న డాక్టరు సుదర్శనం విధుల్లో చేరడంతో మళ్లీ ఆయనకే ఇన్‌చార్జి బాధ్యతలు ఇచ్చారు. డాక్టరు సుదర్శనం కరోనా మొదలైనప్పటి నుంచి విధులు నిర్వర్తించారు. సిబ్బందికి శిక్షణ ఇవ్వడంతో పాటు పీహెచ్‌సీల వారీగా పరీక్షలు నిర్వహించే విధంగా చూశారు. కీలకమైన సమయంలో వైద్య సిబ్బంది సేవలు అందే విధంగా చూస్తే కరోనా వచ్చిన వారి ఇతర వ్యాధులు వచ్చిన వారికి మేలు జరగనుంది. 

Updated Date - 2020-09-10T11:14:00+05:30 IST