Viral Video: యువకుడి వెర్రి చేష్టలు.. మరు క్షణంలోనే దూల తీర్చేసిన ఒంటె

ABN , First Publish Date - 2022-01-15T13:15:36+05:30 IST

ఓ యువకుడి వెర్రి చేష్టలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యువకుడు తనదారిలో తాను తిన్నగా వెళ్లకుండా పక్కనే ఉన్న ఒంటె దగ్గర వెర్రి వేషా

Viral Video: యువకుడి వెర్రి చేష్టలు.. మరు క్షణంలోనే దూల తీర్చేసిన ఒంటె

ఇంటర్నెట్ డెస్క్: ఓ యువకుడి వెర్రి చేష్టలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యువకుడు తనదారిలో తాను తిన్నగా వెళ్లకుండా పక్కనే ఉన్న ఒంటె దగ్గర వెర్రి వేషాలు వేసేందుకు ప్రయత్నించాడు. అయితే మరు క్షణంలోనే ఆ ఒంటె సదరు యువకుడి దూల తీర్చేసింది. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలోని దృశ్యాల ప్రకారం.. ఓ ఒంటె తన దారిలో తాను వెళ్తూ ఉంది. ఇదే సమయంలో అదే రోడ్డుపై వెళ్తున్న ఓ యువకుడు ఒంటె తోకను పట్టుకుని లాగబోయాడు. అయితే.. తోకను పట్టుకోకముందే ఆ ఒంటె సదరు యువకుడికి షాకిచ్చింది. దగ్గరగా వెళ్లిన యువకుడిని వెనక కాలితో ఒక్క తన్ను తన్నింది. దీంతో ఆ యువకుడు కింద పడిపోయాడు. ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తాజాగా ఈ వీడియోను ఫారెస్ట్ సర్విస్ అధికారి సుసంతా నందా ట్విట్టర్‌లో షేర్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు ఈ వీడియోను కొన్ని వేల మంది వీక్షించారు. 






Updated Date - 2022-01-15T13:15:36+05:30 IST