అమెరికాను వణికించిన మెరుపు.. ఎంత దూరం వ్యాపించిందంటే..

ABN , First Publish Date - 2022-07-06T16:30:02+05:30 IST

ఆకాశంలో మెరిసే మెరుపులు మనిషిని...

అమెరికాను వణికించిన మెరుపు.. ఎంత దూరం వ్యాపించిందంటే..

ఆకాశంలో మెరిసే మెరుపులు మనిషిని మొదటి నుంచి భయపెడుతూనే ఉన్నాయి. భూమిపై ఇలాంటి మెరుపులతో కూడిన పిడుగులు పడినప్పుడల్లా విధ్వంసం జరుగుతుంది. రెండేళ్ల క్రితం అమెరికాలో మెరుపులతో కూడిన పిడుగు పడి ప్రపంచ రికార్డు సృష్టించిందని శాస్త్రవేత్తలు తాజాగా ప్రకటించారు. ఈ మెరుపు ఏకంగా మూడు రాష్ట్రాల్లో  కనిపించింది. ఈ మెరుపు సరికొత్త రికార్డును నెలకొల్పినట్లు ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ తాజాగా వెల్లడించింది. 2018నాటి మెరుపు రికార్డును ఇది బద్దలు చేసింది. 2020, ఏప్రిల్ 29న మెరిసిన ఈ మెరుపు ఘటనలో 768 కిలోమీటర్ల పొడవునవున్న యూఎస్ రాష్ట్రాలైన టెక్సాస్, లూసియానా మిసిసిపీలో ప్రకాశించింది. 


ఈ మెరుపు 2018 సంవత్సరంలో బ్రెజిల్‌లో నమోదైన రికార్డును బద్దలు కొట్టింది. బ్రెజిల్ మెరుపు 440.6 మైళ్లు లేదా 709 కిలోమీటర్ల పొడవున వ్యాపించింది. కాగా 2020లో ఉరుగ్వే, ఉత్తర అర్జెంటీనాలో కూడా ఇటువంటి మెరుపు వచ్చింది. ఈ మెరుపు 17.1 సెకన్ల పాటు మెరిసింది. ఈ సందర్భంగా అరిజోనా స్టేట్ యూనివర్శిటీ ప్రపంచ వాతావరణ సంస్థ రికార్డ్ కన్ఫర్మేషన్ చీఫ్ రాండాల్ సెర్విని మాట్లాడుతూ ఈ రెండు మెరుపు సంఘటనలు అసాధారణమైన రికార్డులను నెలకొల్పాయి. ఈ సంఘటనలను రికార్డ్ చేయడానికి చేసిన కృషిని ఆయన అభినందించారు. 

Updated Date - 2022-07-06T16:30:02+05:30 IST