Advertisement

ఐసీసీ చైర్మన్‌ బరిలో కామెరూన్‌

Jun 30 2020 @ 03:18AM

కింగ్‌స్టన్‌: ఐసీసీ చైర్మన్‌ పదవి కోసం క్రికెట్‌ వెస్టిండీస్‌ (సీడబ్ల్యూఐ) మాజీ అధ్యక్షుడు డేవ్‌ కామెరూన్‌ ఎన్నికల బరిలో దిగనున్నాడు. ప్రస్తుత చైర్మన్‌ శశాంక్‌ మనోహర్‌ పదవీ కాలం ముగుస్తుండడంతో ఐసీసీ కొత్త బాస్‌ కోసం సన్నాహకాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా క్రికెట్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌.. కామెరూన్‌ అభ్యర్థిత్వాన్ని ప్రతిపా దిస్తూ మనోహర్‌కు లేఖ రాసింది. కామెరూన్‌ బరిలో నిలవాలంటే రెండు నామినేషన్లు అవసరం. మరి.. విండీస్‌ బోర్డు నుంచి అతనికి మద్దతు లభిస్తుందో లేదో చూడాలి. ప్రస్తుత సీడబ్ల్యూఐ అధ్యక్షుడితో కామెరూన్‌కు సంబంధాలు బాగా లేవు. కాగా, ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు  చీఫ్‌ కొలిన్‌ గ్రేవ్‌.. ఐసీసీ చైర్మన్‌ రేస్‌లో ముందున్నాడు. బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ పేరు కూడా వినిపిస్తోంది.  


Follow Us on:
Advertisement

క్రీడాజ్యోతిమరిన్ని...

Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.