Wife Fight for Husband Bail: పిల్లల్ని కనేందుకు ఖైదీకి బెయిల్ ఇవ్వొచ్చా..? ఓ భార్య పిటిషన్‌పై సుప్రీం ఏం చేయబోతోంది..?

ABN , First Publish Date - 2022-07-26T00:16:44+05:30 IST

జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీకి సంతానం కోసం పెరోల్ మంజూరు చేయవచ్చా?

Wife Fight for Husband Bail: పిల్లల్ని కనేందుకు ఖైదీకి బెయిల్ ఇవ్వొచ్చా..? ఓ భార్య పిటిషన్‌పై సుప్రీం ఏం చేయబోతోంది..?

జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీకి సంతానం కోసం పెరోల్ మంజూరు చేయవచ్చా? ఈ అంశం గురించి త్వరలో సుప్రీంకోర్టు (Supreme Court) విచారించబోతోంది. తన భార్యను తల్లిని చేసేందుకు జీవితఖైదు అనుభవిస్తున్న ఓ వ్యక్తికి 15 రోజుల పెరోల్ మంజూరు చేస్తూ రాజస్థాన్ హైకోర్టు (Rajasthan High Court) గత ఏప్రిల్‌లో సంచలన ఉత్తర్వులిచ్చింది. ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేయగా, దానిపై విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ పిటిషన్‌పై వచ్చే వారం విచారణ జరిగే అవకాశం ఉంది.


ఇది కూడా చదవండి..

46 ఏళ్ల మహిళకు నెల నుంచి కడుపునొప్పి.. భరించలేక చివరకు ఆస్పత్రికి.. నోటి ద్వారా చిన్న కెమెరాను డాక్టర్లు పంపించి చూస్తే..


రాజస్థాన్‌కు చెందిన నంద్ లాల్ అనే వ్యక్తి ఓ కేసులో జీవితఖైదు శిక్ష అనుభవిస్తున్నాడు. వ్యక్తిగత అవసరాల రీత్యా తనకు 15 రోజుల పాటు పెరోల్ మంజూరు చేయాలని అజ్మీర్ జిల్లా కమిటీకి దరఖాస్తు చేసుకున్నాడు. అయితే జిల్లా కమిటీ లాల్‌కు పెరోల్ ఇవ్వలేదు. దీంతో ఆయన భార్య హైకోర్టుకు వెళ్లింది. పిల్లలు కనేందుకు తన భర్తకు 15 రోజుల పాటు పెరోల్ మంజూరు చేయాలని లాల్ కోరుతూ రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించింది. తనకు వివాహం అయినా పిల్లలు లేరని, దాంపత్య అవసరాలు తీరేందుకు బెయిల్ ఇవ్వాలని కోర్టును అభ్యర్థించింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. భర్తతో సంతానాన్ని పొందే హక్కు ఆ మహిళకు ఉందని, దోషిని సాధారణ స్థితికి తీసుకురావడానికి దాంపత్య బంధం సహాయపడుతుందని అభిప్రాయపడింది. 


ఈ పెరో‌ల్‌ని తిరస్కరించడం ఆమె హక్కులను నిరోధించడమేనని అభిప్రాయపడింది. ఈ మేరకు జీవిత ఖైదీకి 15 రోజుల పెరోల్‌ని మంజూరు చేసింది. రూ.25 వేల చొప్పున రెండు పూచీకత్తులతో పాటు రూ.50 వేల వ్యక్తిగత బాండ్‌పై లాల్‌ను విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది. రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై సుప్రీంకోర్టు వచ్చే వారం విచారణ జరపబోతోంది.  

Updated Date - 2022-07-26T00:16:44+05:30 IST