‘కరోనాతో NRI లు విదేశాల్లో మరణిస్తే.. రూ. 50 వేల పరిహారం ఇస్తారా..?’

ABN , First Publish Date - 2021-11-18T21:48:00+05:30 IST

ఎన్నారైలు కరోనా బారిన పడి విదేశాల్లో మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు రూ.50 వేల పరిహారం ఇస్తారా లేదా అనే అంశంపై స్పష్టతనీయాలని కేరళ హైకోర్టు అక్కడి ప్రభుత్వాన్ని కోరింది. ప్రవాసీ లీగల్ సెల్ అనే స్వచ్ఛంద సంస్థ వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు బుధవారం ఈ ప్రశ్న వేసింది.

‘కరోనాతో NRI లు విదేశాల్లో మరణిస్తే.. రూ. 50 వేల పరిహారం ఇస్తారా..?’

ఇంటర్నెట్ డెస్క్: ఎన్నారైలు కరోనా బారిన పడి విదేశాల్లో మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు రూ.50 వేల పరిహారం ఇస్తారా లేదా అనే అంశంపై స్పష్టతనీయాలని కేరళ హైకోర్టు అక్కడి ప్రభుత్వాన్ని కోరింది. ప్రవాసీ లీగల్ సెల్ అనే స్వచ్ఛంద సంస్థ వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు బుధవారం ఈ ప్రశ్న వేసింది. కరోనాతో  విదేశాల్లో మరణించిన ఎన్‌ఆర్ఐలకు ప్రభుత్వ పరిహారాన్ని మంజూరు చేయట్లేదంటూ ప్రవాసీ సెల్ కేరళ హైకోర్టులో ఇటీవల పిటిషన్ వేసింది. ప్రభుత్వం ఇష్టారీతిన నిబంధనలు రూపొందించి ఎన్నారైల కుటుంబాలకు పరిహారాన్ని ఇవ్వట్లేదని ఆరోపించింది. 


‘‘బతుకు తెరువు కోసం అనేక మంది కేరళీయులు కుటుంబాలను విడిచి విదేశాలకు వెళ్లారు. ఇలాంటి వారు విదేశాల్లోనే కరోనాతో మరణించినప్పుడు కాస్తంత సానుభూతి చూపించాలి.’’ అని పిటిషనర్ తరపు న్యాయవాది అభిప్రాయపడ్డారు. వారి పట్ల ఎటువంటి వివక్ష కనబరిచినా అది మానవహక్కులను ఉల్లంఘించడమేనని అని తేల్చి చెప్పారు. ఎన్నారైల కుటుంబాలు పరిహారం కోసం ప్రభుత్వాన్ని పలుమార్లు సంప్రదించినా ఎటువంటి స్పందన లేదని ఆరోపించారు. 


మరోవైపు.. పిటిషన్ వేసిన ఎన్‌జీఓకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదని ప్రభుత్వం తరపు న్యాయవాది వ్యాఖ్యానించగా.. ఈ కేసులో టెక్నికల్ అంశాలపై అతిగా దృష్టి పెట్టాల్సిన అవసరం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. కాగా.. కరోనాతో మరణించిన ఎన్నారైల కుటుంబాలు పరిహారం కోరుతూ తమను సంప్రదించలేదని ఎన్నారై వ్యవహారాల విభాగం ఇటీవలే పేర్కొంది. ఎన్నారైలను కుటుంబాలు కూడా పరిహారానికి అర్హులా కాదా అనే అంశం కేంద్ర ప్రభుత్వమే తేల్చాలని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి గతంలో పేర్కొన్నారు. 

Updated Date - 2021-11-18T21:48:00+05:30 IST