మెకానికల్‌కు మారొచ్చా?

ABN , First Publish Date - 2021-03-08T21:21:44+05:30 IST

మంచి జిపిఏ ఉంటే విదేశాల్లో స్ట్రీమ్‌ మార్చుకోవడం సాధ్యమే. చాలా కొద్ది వర్సిటీలు మాత్రమే ఇలాంటి మార్పునకు అంగీకరిస్తాయి. అయితే ఇలాంటివారు మంచి జిపిఏతోపాటు, జిఆర్‌ఇలో 325పైగా స్కోరు, సివిల్‌ నుంచి మెకానికల్‌కు ఎందుకు వెళ్లాలనుకుంటున్నారో తెలుపుతూ బలమైన

మెకానికల్‌కు మారొచ్చా?

ప్రశ్న: మా అబ్బాయి బీటెక్‌ సివిల్‌ ఇంజనీరింగ్‌ చదువుతున్నాడు. విదేశాల్లో మెకానికల్‌ ఇంజనీరింగ్‌తో పీజీ చేయాలనుకుంటున్నాడు. సాధ్యమేనా?


- ప్రదీప్‌, హైదరాబాద్‌


సమాధానం: మంచి జిపిఏ ఉంటే విదేశాల్లో  స్ట్రీమ్‌ మార్చుకోవడం సాధ్యమే. చాలా కొద్ది వర్సిటీలు మాత్రమే ఇలాంటి మార్పునకు అంగీకరిస్తాయి. అయితే ఇలాంటివారు మంచి జిపిఏతోపాటు,  జిఆర్‌ఇలో 325పైగా స్కోరు, సివిల్‌ నుంచి మెకానికల్‌కు ఎందుకు వెళ్లాలనుకుంటున్నారో తెలుపుతూ బలమైన స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌ తయారు చేసుకుని దరఖాస్తు చేసుకోవాలి. మెకానికల్‌ కోర్సు ప్రపంచంలోని చాలా యూనివర్సిటీల్లో ఉంది. మీకు అనుకూలమైన యూనివర్సిటీని ఎంచుకోండి. 

జర్మన్‌ యూనివర్సిటీలు మెకానికల్‌ ఇంజనీరింగ్‌కు పేరొందినవి. కర్లే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, రైనే-వాల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ అప్లయిడ్‌ సైన్సెస్‌, టియు మ్యూనిచ్‌, ఆర్‌డబ్ల్యూటిహెచ్‌ అచే, కార్ల్‌బెంజ్‌ స్కూల్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌, ఎఫ్‌హెచ్‌ అచే, హొచుల్‌ హిల్‌బార్న్‌ యూనివర్సిటీ, మాగ్‌డెబర్గ్‌ యూనివర్సిటీ తదితరాలు బాగుంటాయి. 

సింగపూర్‌లో అయితే నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సింగపూర్‌, నాన్‌యాంగ్‌ టెక్నలాజికల్‌ యూనివర్సిటీలు బెస్ట్‌. యూకెలో క్రాన్‌ఫీల్డ్‌, బాత్‌, బ్రిస్టల్‌, లీడ్స్‌, షఫీల్డ్‌, ఎడింబరో, ఇంపీరియల్‌ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌, మాంచెస్టర్‌, సౌతాంప్టన్‌ తదితరాల్లో మెకానికల్‌ చదవొచ్చు. అమెరికాలో ఎంఐటి, స్టాన్‌పోర్డ్‌, యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా బర్క్‌లీ, కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, జార్జియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలు తదితరాలు ఫేమస్‌.

Updated Date - 2021-03-08T21:21:44+05:30 IST