ltrScrptTheme3

మొలకలొచ్చిన ఉల్లి, వెల్లుల్లి తినొచ్చా?

Sep 26 2021 @ 12:26PM

ఆంధ్రజ్యోతి(26-09-2021)

మార్కెట్‌కు వెళ్తే తాజా కూరగాయల్ని చూసి కచ్చితంగా తీసుకోవాలనుకుంటాం. అయితే వాటిని ఫ్రిజ్‌లో పెట్టుకొని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి పాడవుతాయనే సమస్య ఉండదు. ఉల్లిగడ్డలు, వెల్లుల్లిని కూడా కిలోల కొద్ది కొనుగోలు చేస్తుంటారు. అయితే వాటిని ఫ్రిజ్‌లో పెట్టే అవకాశం ఉండదు. ఎందుకంటే అలా పెడితే ఫ్రిజ్ అంతా దుర్వాసన వస్తుంది. మరి బయట పెడితే ఉల్లి, వెల్లుల్లిలో మొలకలు రావడం, ఆ మొలకెత్తిన భాగం పాడవడం గమనిస్తుంటాం.


మరి ఎలా.. మొలకలు వచ్చిన ఉల్లి, వెల్లుల్లి తినొచ్చా? లేదా? అనే సందేహం అందరిలో కలుగుతుంది. నిపుణుల సూచనల ప్రకారం.. మొలకలు పెద్దగా అయితే ఉల్లి, వెల్లుల్లి పాడవుతుంది. అలాంటపుడు వాటిని వాడకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. మొలకలు కనుక అప్పుడప్పుడే వచ్చి ఉల్లి, వెల్లుల్లిలోని కొంత భాగం కనుక పాడయినట్లు గమనిస్తే దాన్ని తొలిగించి వంటల్లో వినియోగించుకోవచ్చని అంటున్నారు. దీని వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవని నిపుణులు చెబుతున్నారు. 

Follow Us on:

Health Latest newsమరిన్ని...

ప్రత్యేకంమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.