ltrScrptTheme3

నా కొడుకును నేను కాపాడుకోగలనా?

Mar 3 2021 @ 15:54PM

"నా కొడుకును నేను కాపాడుకోగలనా? వాడి వైద్యానికి కావలసిన డబ్బు త్వరగా సిద్ధం చేసుకోకపోతే ఏమవుతుంది? నా పిల్లాడిని ఎత్తుకోవడం ఇదే చివరిసారి కాదు కదా?..."


ఆస్పత్రి ఆవరణలో తిరుగుతున్న నా మనసులో ఈ ప్రశ్నలు నిప్పుకణాల్లో రగులుతున్నాయి. ఆ రోజున.... నా భార్య ముజబ్త్ నాకు కాల్ చేసి, జరిగిన దారుణం గురించి చెప్పగానే ఆసుపత్రికి పరిగెత్తాను.


మా అబ్బాయి అర్హాన్ పరిస్థితి చాలా కష్టంగా ఉండటంతో అత్యవసర చికిత్స చెయ్యాలని డాక్టర్లు ఈ మధ్యనే చెప్పారు. మా అబ్బాయికి పుట్టుకతోనే గుండెకు సంబంధించిన క్లిష్టమైన సమస్య ఉన్నట్టు పరీక్షల్లో తేలింది.


మా పిల్లవాడికి ఆర్టెరియల్ స్విచ్ ఆపరేషన్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేసి ASD (Atrial Septal Defect) చక్కదిద్దాలని డాక్టర్లు తెలిపారు. ఈ ఆపరేషన్ వేగంగా జరగకపోతే మా అబ్బాయి మాకు శాశ్వతంగా దూరమయ్యే ప్రమాదం పొంచి ఉంది.


ప్రతి క్షణం నన్ను ఆందోళనలో ముంచెత్తుతోంది. ఎందుకంటే, అర్హాన్ ప్రాణానికి అత్యంత విలువైన కాలం గడిచిపోతోంది. కానీ నా చేతులు కట్టేసి ఉన్నాయి. కొడుకు ఆరోగ్యం ఎలా ఉందోనని నర్సులు, డాక్టర్లను అనుక్షణం ముజబ్త్ అడుగుతూనే ఉంది. నా కొడుక్కి గండం గట్టెక్కుతుందా?... కోలుకోవడానికి అవసరమైనవన్నీ ఉన్నాయా?... అని ప్రశ్నిస్తూనే ఉంది. కానీ, ప్రతిసారీ నిరుత్సాహపూరితమైన సమాధానమే వస్తోంది. సమాజంలో బలహీన వర్గాలకు చెందినవారం కావడంతో మా అబ్బాయిని కాపాడుకోవడానికి అవసరమైన చికిత్స చేయించే స్థితి లేదు.ఇప్పుడు మాకు అర్హాన్ చికిత్స కోసం రూ.6,00,000 (ఆరు లక్షలు) కావాలి. బహుశా ఇతరులకు ఇంత డబ్బు పెద్దదేం కాకపోవచ్చు కానీ, నాకు మాత్రం భరించలేనంత భారం. కూలీగా పనిచేస్తున్న నేను, నా కుటుంబానికి తగినంత ఆసరా ఇవ్వలేకపోతున్నాను. నేను ఎంత కష్టపడినా సరే, ఇంత డబ్బు సమకూర్చుకోలేను.


ఇప్పటికైతే నేను, ముజబ్త్ ఇద్దరం ఆస్పత్రి ఆవరణలోనే నిరీక్షిస్తూ మాపై దయ చూపించి మా అబ్బాయిని కాపాడమని అల్లాను ప్రార్థిస్తున్నాం.... అని ఆవేదనతో తన బాధను వెళ్ళగక్కాడు అర్హాన్ తండ్రి జావెద్.


తమ నవజాత శిశువు అర్హాన్ చికిత్సకు అవసరమైన ఖర్చును జావెద్, ముజబ్త్ చెల్లించే స్థితిలో లేరు. కానీ, మీరంతా తోడై నిలిచి వారి ఆశాజ్యోతిని నిలిపేందుకు అండగా నిలుస్తాని వారు కొండంత ఆశతో ఎదురు చూస్తున్నారు.


ఇప్పుడు మీరే వారికి తోడునీడ. మీ చేయూత లేకుంటే... జీవితాంతం కుమిలిపోయే పరిస్థితి ఎదురవుతుందేమోనని ఆ తల్లిదండ్రులు వేదన చెందుతున్నారు. అందువల్ల పెద్ద మనసు చేసుకుని అర్హాన్ వైద్యం కోసం మీకు సాధ్యమైనంత విరాళాన్ని అందజేయండి.


నిండు మనసుతో అర్హాన్‌ కోసం విరాళం ఇవ్వండి

Follow Us on:

జాతీయం మరిన్ని...

చిత్రజ్యోతి మరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.