యూనివర్సిటీ కొలువుల భర్తీ కలేనా

ABN , First Publish Date - 2020-02-19T06:16:13+05:30 IST

దేశ వ్యాప్తంగానున్న విశ్వ విద్యాలయాలల్లో ఖాళీగానున్న ఆచార్య , సహాచార్య కొలువుల భర్తీ ప్రక్రియను మొదలుపెట్టి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని యూనివర్సిటీ గ్రాంట్ కమీషన్ కోరి సంవత్సరం..

యూనివర్సిటీ కొలువుల భర్తీ కలేనా

దేశ వ్యాప్తంగానున్న విశ్వ విద్యాలయాలల్లో ఖాళీగానున్న ఆచార్య , సహాచార్య కొలువుల భర్తీ ప్రక్రియను మొదలుపెట్టి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని యూనివర్సిటీ గ్రాంట్ కమీషన్ కోరి సంవత్సరం గడిచిపోయినా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉండిపోయింది. తెలంగాణలో 2018 నుండి ఇప్పటివరకు రిక్రూట్‌మెంట్‌ జరగలేదు. ఇది నిరుద్యోగులకు అందని ద్రాక్షలా మారింది. కొలువుల కోసమే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11 యూనివర్సిటీల్లో 99 ప్రొఫెసర్లు , 270 అసోసియేట్ ప్రొఫెసర్స్, 692 అసిస్టెంట్ ప్రొఫెసర్స్ వెరసి 1061 ఖాళీలున్నాయని ప్రభుత్వమే తేల్చింది. కానీ, ఒక్క పోస్టూ భర్తీ చేయలేదు. ఈ కొలువులపై ఆశలు పెట్టుకున్న నిరుద్యోగులకు రిటైర్‌మెంట్‌ దగ్గరపడుతున్నా ఉద్యోగాలు మాత్రం రావడం లేదు. ఎన్నో పథకాలు అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాలు లేక దీనస్థితిలోనున్న నిరుద్యోగులను ఆదుకోవాలనీ ఆచార్య ఉద్యోగాలను భర్తీ చేయాలనీ కోరుతున్నాను. 

డా. పోలం సైదులు,

హైదరాబాద్‌

Updated Date - 2020-02-19T06:16:13+05:30 IST