ఈ ప్రశ్న ఖరీదు కోటి రూపాయలు.. మీకు ఆన్సర్ తెలుసా?

ABN , First Publish Date - 2021-09-30T17:24:47+05:30 IST

మొదటి ప్రపంచ యుద్ధ సమయానికి సంబంధించిన ఓ ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ అవువతోంది. ఈ ప్రశ్న ఖరీదు కోటి రూపాయలు.. అన్సర్ తెలిస్తే చెప్పండంటూ ట్రెండ్

ఈ ప్రశ్న ఖరీదు కోటి రూపాయలు.. మీకు ఆన్సర్ తెలుసా?

ఇంటర్నెట్ డెస్క్: మొదటి ప్రపంచ యుద్ధ సమయానికి సంబంధించిన ఓ ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రశ్న ఖరీదు కోటి రూపాయలు.. అన్సర్ తెలిస్తే చెప్పండంటూ ట్రెండ్ అవుతోంది. దీంతో స్పందిస్తున్న  నెటిజన్లు.. కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకీ అంత విలువైన ఆ ప్రశ్న ఏంటి? అనే వివరాల్లోకి వెళితే.. 


బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్పతి ప్రోగ్రాం గురించి అందరికీ తెలిసే ఉంటుంది. 12 సీజన్లను విజయవంతం ముగించుకుని.. 13వ సీజన్లో కూడా ప్రేక్షకులను ఏ మాత్రం డిసప్పాయింట్ చేయకుండా దూసుకుపోతోంది. ఇప్పటికే చాలా మంది ఈ ప్రోగ్రామ్ ద్వారా కోట్లాది రూపాయలను గెలుచుకోగా.. ఇందులో పాల్గొనేందకు దేశ వ్యాప్తంగా లక్షలాది మంది ఆసక్తి చూపుతూ పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ హాస్పిటల్‌లో సీనియర్ నర్సింగ్ సూపరింటెండెంట్ పని చేస్తున్న సవితా భాటిని అదృష్టం వరించింది. ప్రోగ్రాంకు సెలెక్ట్ అవడమే కాకుండా హాట్ సీట్ వరకూ వెళ్లింది. 



14 ప్రశ్నలకూ చకచకా ఆన్సర్ చేసి.. రూ. 50లక్షలను తన ఖాతాలో వేసుకున్న ఆమె 15వ ప్రశ్న వద్ద తడబడింది. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో, 1915-16లో టర్కీలో జరిగిన ఏ యుద్ధంలో దాదాపు 16,000 మంది భారత సైనికులు మిత్రదేశాలతో కలిసి ధైర్యంగా పోరాడారు? అనే కోటి రూపాయల ప్రశ్నకు సమాధానం చెప్పలేక పోయింది. రూ.50 లక్షలను తీసుకుని గేమ్ నుంచి వచ్చేసింది. కాగా.. ప్రస్తుతం సవితా ఎదుర్కొన్న ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో కొందరు నెటిజన్లు స్పందిస్తూ.. ఆన్సర్‌ను కామెంట్ రూపంలో రాస్తున్నారు. 


Updated Date - 2021-09-30T17:24:47+05:30 IST