‘ఓ రహస్యాన్ని దాచి ఉంచగలరా ?’... ట్విట్టర్‌లో ‘ఓలా’ హల్‌చల్...

Published: Wed, 26 Jan 2022 15:00:03 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఓ రహస్యాన్ని దాచి ఉంచగలరా ?... ట్విట్టర్‌లో ఓలా హల్‌చల్...

హైదరాబాద్ : ఓలా నుంచి రానున్న విద్యుత్తు కారు... ట్విటర్‌లో హల్‌‌చల్ చేస్తోంది. విద్యుత్తు కారు ఎలా ఉంటుందో చెప్పే క్రమంలో... ఓ టీజర్ ఫోటోను సామాజిక మాధ్యమాల్లో... కంపెనీ షేర్ చేసింది. సిల్వర్ రంగులో, టాప్ మొత్తం నలుపు రంగు గ్లాస్‌తో కవర్‌ చేయబడి హూందాతనాన్ని ప్రదర్శిస్తోంది ఈ కారు. మొత్తంమీద... నిస్సాన్‌ లీఫ్‌ ఈవీ కారు మాదిరిగా కనిపిస్తోందన్న వ్యాఖ్యానాలు ఈ సందర్భంగా వినవస్తున్నాయి. 


కాగా... ఓలా విడుదల చేసిన ఈ విద్యుత్తు కారు డిజైన్ ... ‘కాన్సెప్ట్’ మాదిరిగా కనిపిస్తోందని చెబుతున్నారు. ఇక... స్టైలిష్ బ్యాటరీ-ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌గా ఉండనుంది. స్మాల్‌ హ్యచ్‌బ్యాక్‌తో టెస్లా మోడల్‌ 3 లాగా ఓలా విద్యుత్తు కారు డిజైన్‌ ఉందన్న వ్యాఖ్యానాలు వినవస్తున్నాయి. ‘మీరు ఒక రహస్యాన్ని దాచి ఉంచగలరా ?’ అని ప్రశ్నిస్తూ... కారు ఫోటోను భవీష్ అగర్వాల్ ట్విటర్‌లో షేర్ చేశారు. కాగా... ఈ విద్యుత్తు కారును వచ్చే ఏడాది విడుదల చేయనున్నట్టు గతంలో భవీష్ అగర్వాల్ వెల్లడించిన విషయం తెలిసిందే. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.