Canada: భారత్‌లోని ఆ రాష్ట్రాలకు అస్సలు వెళ్లొద్దు.. తమ దేశ పౌరులకు కెనడా సూచన!

ABN , First Publish Date - 2022-09-28T22:00:24+05:30 IST

భారత పర్యటనలో ఉన్న కెనడా పౌరుల(Canada Citizens)కు ఆ దేశం కీలక సూచనలు చేసింది. భద్రతాపరమైన కారణాల వల్ల భారత్‌లోని కొన్ని రాష్ట్రాల్లో అస్సలు పర్యటించొద్దని హెచ్చరించింది. ఈ మేరకు తాజాగా విడుదల చేసిన ట్రావెల్ అడ్వైజ్‌

Canada: భారత్‌లోని ఆ రాష్ట్రాలకు అస్సలు వెళ్లొద్దు.. తమ దేశ పౌరులకు కెనడా సూచన!

ఎన్నారై డెస్క్: భారత పర్యటనలో ఉన్న కెనడా పౌరుల(Canada Citizens)కు ఆ దేశం కీలక సూచనలు చేసింది. భద్రతాపరమైన కారణాల వల్ల భారత్‌లోని కొన్ని రాష్ట్రాల్లో అస్సలు పర్యటించొద్దని హెచ్చరించింది. ఈ మేరకు తాజాగా విడుదల చేసిన ట్రావెల్ అడ్వైజ్‌లో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


కెనడా ప్రభుత్వం (Canada Govt) ఈ నెల 27న ట్రావెల్ అడ్వైజరీని అప్‌డేట్ చేసింది. ఇందులోని వివరాల ప్రకారం.. భద్రతాకారణాల వల్ల భారత్‌లోని గుజరాత్, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలకు వెళ్లొద్దని తమ దేశ పౌరులకు కెనడా సూచించింది. పాకిస్థాన్‌తో సరిహద్దు కలిగిన ఈ రాష్ట్రాల్లో ఆకస్మిక ఉగ్ర దాడులు జరిగే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా పాకిస్థాన్ సరిహద్దుకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏరియాల్లో ఈ ఘటనలు చోటు చేసుకోవచ్చని అంచనా వేసింది. అంతేకాకుండా అత్యవసరం అయితేనే అస్సాం, మణిపూర్‌ రాష్ట్రాల్లో పర్యటించాలని చెప్పింది. లేదంటే పర్యటనను వాయిదా వేసుకోవాలని వెల్లడించింది. 


భారతీయులను హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం

కెనడాలో నేరాలు, భారత వ్యతిరేక కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని సెప్టెంబరు 23న భారత ప్రభుత్వం(Indian Govt).. ఆ దేశంలో ఉంటున్న భారత పౌరులు(Indian Citizens), విద్యార్థులను(Indian Students) హెచ్చరించింది. అంతేకాకుండా ఈ ఘటనలపై చర్యలు తీసుకోవాలని కూడా కెనడా ప్రభుత్వాన్ని కోరింది. 


Updated Date - 2022-09-28T22:00:24+05:30 IST