30రోజులపాటు భారతీయులు కెనడా వెళ్లలేరు!

ABN , First Publish Date - 2021-04-23T18:14:50+05:30 IST

భారతదేశంలో కరోనా తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో కెనడ కీలక నిర్ణయం తీసుకుంది. భారత విమానాలపై 30 రోజులపాటు నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. కార్గో విమానాలకు దీని నుంచి మినహాంపు

30రోజులపాటు భారతీయులు కెనడా వెళ్లలేరు!

ఒట్టావా: భారతదేశంలో కరోనా తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో కెనడా కీలక నిర్ణయం తీసుకుంది. భారత విమానాలపై 30 రోజులపాటు నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. కార్గో విమానాలకు దీని నుంచి మినహాంపు ఇస్తున్నట్టు స్పష్టం చేసింది. భారతదేశంలో ఎపిడెమియోలాజికల్ పరిస్థితిని అధ్యయనం చేసిన తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కెనడా ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ వివరించారు. భారత్‌కు వెళ్లేందుకు ప్రణాళికలు రూపొందించుకున్న వారిని ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడారు. అనవసర ప్రయాణాలను రద్దు చేసుకోవాలని సూచించారు. కేవలం భారత విమానాలపైనే కాకుండా పాకిస్థాన్‌కు చెందిన విమానాలకు కూడా ఈ నిషేధం వర్తిస్తుందని పేర్కొన్నారు. విదేశాల నుంచి కెనడా వస్తున్న ప్రయాణికులు ప్రయాణానికి ముందు కొవిడ్ పరీక్ష చేయించుకోవాలని తెలిపారు. కెనడాకు చేరుకున్న తర్వాత 14రోజులపాటు తప్పనిసరిగా క్వారెంటైన్‌లో ఉండాలని చెప్పారు.   


Updated Date - 2021-04-23T18:14:50+05:30 IST