Canadaలో రెండు ఓమైక్రాన్ వేరియెంట్ కేసులు...కలకలం

ABN , First Publish Date - 2021-11-29T14:18:27+05:30 IST

కెనడా దేశంలో కరోనా కొత్త వేరియంట్‌ ‘ఒమైక్రాన్‌’ ఇద్దరు వ్యక్తులకు సోకిందని సోమవారం జరిపిన పరీక్షల్లో తేలింది....

Canadaలో రెండు ఓమైక్రాన్ వేరియెంట్ కేసులు...కలకలం

కెనడా: కెనడా దేశంలో కరోనా కొత్త వేరియంట్‌ ‘ఒమైక్రాన్‌’ ఇద్దరు వ్యక్తులకు సోకిందని సోమవారం జరిపిన పరీక్షల్లో తేలింది. ఇటీవల నైజీరియా దేశంలో పర్యటించి వచ్చిన ఇద్దరు ప్రయాణికులకు ఒమైక్రాన్ కొత్త వేరియెంట్ సోకడం కలకలం రేపింది. కొత్త వేరియెంట్ రెండు కేసులు నమోదైన నేపథ్యంలో సోమవారం కెనడా దేశంలో ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు.కాగా కరోనావైరస్ ఒమైక్రాన్ వేరియంట్ మరింత వ్యాప్తి చెందుతుందా? లేదా? అనేది ఇంకా స్పష్టంగా తెలియదని ప్రపంచ ఆరోగ్యసంస్థ తెలిపింది. ‘‘ఒమైక్రాన్ కొత్త వేరియెంట్ మళ్లీ ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతోంది. కానీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలు ఒమైక్రాన్ వేరియెంట్ సోకినా మరణం  సంభవించకుండా ప్రభావవంతంగా పనిచేస్తాయి’’ అని ప్రపంచఆరోగ్య సంస్థ పేర్కొంది.

Updated Date - 2021-11-29T14:18:27+05:30 IST