Canada లో మళ్లీ తెరపైకి Express Entry system.. భారతీయులకు ఎలా లాభమంటే..

ABN , First Publish Date - 2022-05-29T02:41:51+05:30 IST

కెనడాలో టెక్ రంగం అభివృద్ధికి ఊతమిచ్చేలా వలసలను ప్రోత్సహించేందుకు అక్కడి ప్రభుత్వం కీలక మార్పులకు సమాయత్తమవుతోంది.

Canada లో మళ్లీ తెరపైకి Express Entry system.. భారతీయులకు ఎలా లాభమంటే..

ఎన్నారై డెస్క్: కెనడాలో టెక్ రంగం అభివృద్ధికి ఊతమిచ్చేలా వలసలను ప్రోత్సహించేందుకు అక్కడి ప్రభుత్వం కీలక మార్పులకు సమాయత్తమవుతోంది. విదేశీ యువతను ఆకర్షించేందుకు వీలుగా.. పాయింట్ బేస్డ్ ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ వ్యవస్థలో సవరణ కోసం ఓ ముసాయిదా బిల్లు రూపొందించింది. విద్యార్హతలు, వృత్తిపరమైన ప్రత్యేక నైపుణ్యాలున్న వారిని ఎంపిక చేసేందుకు ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ క్యాండిడేట్స్ పేరిట ఓ కొత్త కేటగిరీని ఏర్పాటు చేయనున్నట్టు వలసల శాఖ మంత్రి షాన్ ఫ్రేసర్ తాజాగా తెలిపారు. తద్వారా... ఇటువంటి నిపుణుల ఎంపిక కోసం ప్రత్యేకంగా లాటరీ నిర్వహించే అవకాశం కలుగుతుందని చెప్పారు. ఇలా ఎంపికైన వారికి కెనడాలో శాశ్వత నివాసార్హత కూడా లభిస్తుంది. 


కాగా.. ఈ మార్పులు భారతీయులకు అమితంగా లాభిస్తాయని పరిశీలకులు చెబుతున్నారు. ప్రస్తుతం కెనడాలో భారత మూలాలున్న వారి సంఖ్య ఎక్కువే. అనేక మంది భారతీయ విద్యార్థులు ఎమ్‌బీఏ, కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్, సప్లై చెయిన్ మేనేజ్‌మెంట్ వంటి కీలక కోర్సులు చదువుతున్నారు. వృత్తినిపుణుల కోసం ఓ ప్రత్యేక కేటగిరీని ఏర్పాటు చేస్తే.. భారతీయ విద్యార్థుల్లో అనేక మందికి కెనడాలో శాశ్వత నివాసార్హత వచ్చే అవకాశాలు మెరుగవుతాయని చెబుతున్నారు. 

Updated Date - 2022-05-29T02:41:51+05:30 IST