గుడ్‌న్యూస్ చెప్పిన Canada.. భారతీయ ప్రవాసులకు భారీ లబ్ధి

ABN , First Publish Date - 2022-06-09T19:43:41+05:30 IST

కెనడాలో పర్మినెంట్ రెసిడెన్సీ కలిగిన విదేశీయుల తల్లిదండ్రులకు ఇచ్చే సూపర్ వీసాల విషయంలో కెనడా ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ వీసాల గడువు విషయంలో సడలింపులు ఇచ్చింది. సింగిల్ ఎంట్రీపై ఐదేళ్ల వరకు మినహాయింపు ఇచ్చింది. రెండేళ్లకు ఒకసారి రెన్యువల్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. పదేళ్ల కాలపరిమితితో దీన్ని జారీ చేస్తారు.

గుడ్‌న్యూస్ చెప్పిన Canada.. భారతీయ ప్రవాసులకు భారీ లబ్ధి

ఎన్నారై డెస్క్: కెనడాలో పర్మినెంట్ రెసిడెన్సీ కలిగిన విదేశీయుల తల్లిదండ్రులకు ఇచ్చే సూపర్ వీసాల విషయంలో కెనడా ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ వీసాల గడువు విషయంలో సడలింపులు ఇచ్చింది. సింగిల్ ఎంట్రీపై ఐదేళ్ల వరకు మినహాయింపు ఇచ్చింది. రెండేళ్లకు ఒకసారి రెన్యువల్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. పదేళ్ల కాలపరిమితితో దీన్ని జారీ చేస్తారు. ఇక తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం జూలై 4వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని కెనడా ఇమ్మిగ్రేషన్‌శాఖ మంత్రి సీన్ ఫ్రేజర్ వెల్లడించారు. కెనడా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల భారతీయ ప్రవాసులు గణనీయమైన లబ్ధి పొందే అవకాశం ఉంది. ఎందుకంటే కెనడాలో అత్యధిక శాశ్వత నివాస హోదా కలిగిన వారు భారతీయులే. 


ముఖ్యంగా సిక్కు కమ్యూనిటీ ఆ దేశంలో భారీ సంఖ్యలో ఉన్న విషయం తెలిసిందే. 2020లో ఏకంగా 50,841 మంది భారతీయులు పర్మినెంట్ రెసిడెన్సీ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు Express Entry(శాశ్వత నివాసాల కోసం వచ్చే దరఖాస్తులను ప్రాసెస్ చేసే వ్యవస్థ) పేర్కొంది. ఆ ఏడాది వచ్చిన మొత్తం దరఖాస్తులు 1.07లక్షలు అయితే.. అందులో కేవలం భారతీయుల నుంచి వచ్చినవి 50,841 అని వెల్లడించింది. అంటే ఇది మొత్తం దరఖాస్తుల సంఖ్యలో సుమారు 47శాతం అన్నమాట. కాగా, 2011లో తమ దేశంలో శాశ్వత నివాసం కలిగిన విదేశీయుల పిల్లలు తల్లింద్రులను కలిపి ఉంచాలనే సదుద్దేశంతో కెనడా.. ఇమ్మిగ్రేషన్ రిఫ్యూజీస్ అండ్ సిటిజెన్షిప్ కెనడా(IRCC) అనే ప్రత్యేక పథకాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారానే ఇప్పుడు సూపర్ వీసాల పరిమితిని పొడిగించింది.  

Updated Date - 2022-06-09T19:43:41+05:30 IST