Canada: కెనడా వెళ్లేందుకు సిద్ధం అవుతున్న వారికి గుడ్ న్యూస్.. కెనడా మంత్రి కీలక ప్రకటన.. అక్టోబర్ 1 నుంచి..

ABN , First Publish Date - 2022-09-28T20:53:10+05:30 IST

అంతర్జాతీయ ప్రయాణికులకు కెనడా ప్రభుత్వం(Canada Govt) తీపి కబురు చెప్పింది. ఎట్టకేలకు కరోనా నిబంధనలను పూర్తిగా తొలగిస్తున్నట్టు వెల్లడించింది. అక్టోబర్ 1 నుంచి ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం తీసుకోవడా

Canada: కెనడా వెళ్లేందుకు సిద్ధం అవుతున్న వారికి గుడ్ న్యూస్.. కెనడా మంత్రి కీలక ప్రకటన.. అక్టోబర్ 1 నుంచి..

ఎన్నారై డెస్క్: అంతర్జాతీయ ప్రయాణికులకు కెనడా ప్రభుత్వం(Canada Govt) తీపి కబురు చెప్పింది. ఎట్టకేలకు కరోనా నిబంధనలను పూర్తిగా తొలగిస్తున్నట్టు వెల్లడించింది. అక్టోబర్ 1 నుంచి ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాన్ని కూడా కెనడా వెల్లడించింది. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


కరోనా(Corona) మహమ్మారి యావత్ ప్రపంచాన్ని ముప్పు తిప్పలు పెట్టింది. అన్ని దేశాలు లాక్‌డౌన్ విధించే పరిస్థితిని కల్పించింది. అయితే.. టీకా అందుబాటులోకి వచ్చిన తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. క్రమంగా అన్ని దేశాలు.. కొన్ని నిబంధనలతో విదేశీ ప్రయాణికులను తమ దేశంలోకి అనుమతించాయి. ఆ తర్వాత మహమ్మారి ప్రభావాన్ని బట్టి.. నిబంధనలను మరింత సరళతరం చేశాయి. అయితే.. కెనడా మాత్రం కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేసింది. తమ దేశ పౌరుల భద్రత దృష్ట్యా... అంతర్జాతీయ ప్రయాణికులు(International Travellers) వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌ను సమర్పించే నిబంధనను ఇంకా అమలు చేస్తూనే ఉంది. అంతేకాకుండా.. మాస్కులు ధరించాలని.. కొవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్‌ను కూడా చూపించాలని ఇలా చాలా రకాల నిబంధనలను ఇప్పటికీ అమలు చేస్తుంది. 



ఈ నిబంధనలపై తాజాగా కెనడా కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ ప్రయాణికుల విషయంలో అమలవుతున్న కొవిడ్ నిబంధనలను పూర్తిగా ఎత్తేస్తున్నట్టు ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి తాజాగా వెల్లడించారు. అక్టోబర్ 1 నుంచి క్వారెంటైన్ పాలసీతో సహా కొవిడ్‌కు సంబంధించిన నిబంధనలన్నింటినీ ఎత్తివేస్తున్నట్టు స్పష్టం చేశారు. కెనడా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం వెనక ఉన్న కారణాన్ని ఆ దేశ ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ వెల్లడించారు. కెనడా పౌరులు అందరూ వ్యాక్సిన్ వేసుకున్నారని.. వారి ఆరోగ్యానికి ప్రమాదంలేదని భావించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన స్పష్టం చేశారు. ఈ నిర్ణయం వల్ల కెనడాలో రవాణా రంగం తిరిగి పూర్తి స్థాయిలో పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 


Updated Date - 2022-09-28T20:53:10+05:30 IST