Ukraine దేశానికి కెనడా యాంటీ ట్యాంక్ ఆయుధాలు, రాకెట్‌లు

ABN , First Publish Date - 2022-03-01T13:19:10+05:30 IST

ఉక్రెయిన్ దేశానికి కెనడా యాంటీ ట్యాంక్ ఆయుధాలను సరఫరా చేస్తోంది....

Ukraine దేశానికి కెనడా యాంటీ ట్యాంక్ ఆయుధాలు, రాకెట్‌లు

ఒట్టావా : ఉక్రెయిన్ దేశానికి కెనడా యాంటీ ట్యాంక్ ఆయుధాలను సరఫరా చేస్తోంది. రష్యా సైనిక దాడికి వ్యతిరేకంగా ఉక్రెయిన్ దేశానికి మద్ధతుగా కెనడా దేశం యాంటీ ట్యాంక్ ఆయుధాలు, అప్ గ్రేట్ మందుగుండు సామగ్రిని సరఫరా చేస్తుందని ఆ దేశ ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో వెల్లడించారు. రష్యా ముడి చమురు దిగుమతులను నిషేధించనున్నట్లు ట్రూడో పేర్కొన్నారు.రష్యన్ మిలిటరీకి వ్యతిరేకంగా ఉక్రెయిన్ వీరోచిత పోరాటానికి కెనడా మద్దతు కొనసాగిస్తుందని ట్రూడో ఒట్టావాలో విలేకరులతో చెప్పారు.అంతర్జాతీయ బ్యాంకు చెల్లింపుల కోసం స్విఫ్ట్ వ్యవస్థ నుంచి రష్యాను తొలగించడాన్ని సమర్ధించడంతో సహా పలు ఆంక్షలకు కెనడా మద్దతు ఇచ్చింది. కెనడా ఇప్పటికే ఉక్రెయిన్ దేశానికి ఆయుధాలతోపాటు ఔషధాలను పంపింది.తాము ఉక్రెయిన్ దేశానికి 100 కార్ల గుస్టాఫ్ యాంటీ ట్యాంక్ వెపన్ సిస్టమ్స్, 2వేల రాకెట్లను పంపిస్తామని కెనడా రక్షన శాఖ మంత్రి అనితా ఆనంద్ చెప్పారు.


Updated Date - 2022-03-01T13:19:10+05:30 IST