పెదవాగు కాలువకు గండి

ABN , First Publish Date - 2022-06-24T05:40:33+05:30 IST

మండలంలోని గుమ్మడివల్లి సమీపంలోని పెదవాగు ప్రాజెక్టు డీ-కాలువకు కొత్తూరు సమీపంలో చిన్నపాటి గండి పడటంతో నీరంతా వృథాగా పోతుంది.

పెదవాగు కాలువకు గండి
వృథాగా పోతున్న నీరు

వృధాగా పోతున్న నీరు

అశ్వారావుపేట రూరల్‌, జూన్‌ 23: మండలంలోని గుమ్మడివల్లి సమీపంలోని పెదవాగు ప్రాజెక్టు డీ-కాలువకు కొత్తూరు సమీపంలో చిన్నపాటి గండి పడటంతో నీరంతా వృథాగా పోతుంది. కాలువకు కొన్నేళ్లుగా మరమ్మతులు చేపట్టకపోవటంతో పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. కాలువలకు నీరు వదలకపోయినా గేట్ల వద్ద నీటికట్టడి లేకపోవటంతో లీకై కాలువల్లో ప్రవహిస్తూనే ఉంది. కొత్తూరు సమీపంలో వారం క్రితం గండి పడింది. దీంతో కాలువల్లోని ప్రవహించే రెండు మూడు ఇంజన్ల నీరంతా కూడా వృఽథాగా పోతుంది. కాలువకు గండి పడినా అధికారులు పూడ్చటంలేదని ఆయకట్టు రైతులు వాపోతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి గండిని పూడ్చాలని రైతులు కోరుతున్నారు. ఇదే విషయమై ప్రాజెక్టు ఏఈ కృష్ణ మాట్లాడుతూ కాలువకు గండి పడలేదని, రైతు పైపు వేసుకోవటం ద్వారా ఈప్రాంతం కోతకు గురై నీరు బయటకు పోతోందన్నారు. వెంటనే కోత పడిన ప్రాంతాన్ని పూడ్చివేస్తామని తెలిపారు.

Updated Date - 2022-06-24T05:40:33+05:30 IST