వడ్డీ రేట్లు తగ్గించిన కెనరా బ్యాంక్‌

ABN , First Publish Date - 2020-07-07T06:45:39+05:30 IST

ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర.. ఎంసీఎల్‌ఆర్‌ వడ్డీ రేట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. అదనపు నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రుణాలపై వసూలు చేసే ఎంసీఎల్‌ఆర్‌ వడ్డీ రేటును...

వడ్డీ రేట్లు తగ్గించిన కెనరా బ్యాంక్‌

ముంబై: ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర.. ఎంసీఎల్‌ఆర్‌ వడ్డీ రేట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. అదనపు నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రుణాలపై వసూలు చేసే ఎంసీఎల్‌ఆర్‌ వడ్డీ రేటును 10 బేసిస్‌ పాయింట్లు తగ్గిస్తున్నట్టు కెనరా బ్యాంక్‌ వెల్లడించింది. దీంతో ఏడాది కాల పరిమితి ఉండే ఈ రుణాలపై వడ్డీ రేటు 7.65 శాతం నుంచి 7.55 శాతానికి, మూడు నెలల కాలపరిమితి ఉండే రుణాలపై వడ్డీ 7.55 శాతం నుంచి 7.45 శాతానికి తగ్గనుంది. మంగళవారం నుంచే ఈ తగ్గింపు అమల్లోకి రానుంది. కాగా పుణె కేంద్రంగా  కార్యకలాపాలు సాగిస్తున్న బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర (బీఓఎం) కూడా తన ఎంసీఎల్‌ఆర్‌ ఆధారిత రుణాలపై వడ్డీ రేటును 20 బేసిస్‌ పాయింట్లు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో ఏడాది కాలపరిమితి ఉండే రుణాలపై వడ్డీ రేటు 7.7 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గనుంది. 

Updated Date - 2020-07-07T06:45:39+05:30 IST